ముకుందగా వరుణ్ తేజ్ | Varun Tej's debut film titled Mukunda | Sakshi
Sakshi News home page

ముకుందగా వరుణ్ తేజ్

Aug 17 2014 11:01 PM | Updated on Sep 2 2017 12:01 PM

ముకుందగా వరుణ్ తేజ్

ముకుందగా వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ ‘ముకుంద’గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘ముకుంద’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కొత్త బంగారులోకం’,

వరుణ్ తేజ్ ‘ముకుంద’గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఆయన హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘ముకుంద’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో అభిరుచి గల దర్శకునిగా ప్రేక్షకుల కితాబులందుకున్న  శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెలిసిందే. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.
 
 యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువయ్యే విధంగా ఇందులో వరుణ్‌తేజ్ పాత్ర ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) తెలిపారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేశ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: మణికందన్, నిర్మాణం: లియో ప్రొడక్షన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement