శ్రీమంతుడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మహేష్ తన తదుపరి చిత్రం మీద దృష్టి పెట్టాడు. గతంలోనే ప్రకటించినట్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ శుక్రవారం లాంచనంగా ప్రారంభమవుతున్న ఈ సినిమా ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళుతుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో మహేష్కు ఘనవిజయం అందించిన శ్రీకాంత్ అడ్డాల మరోసారి సూపర్ స్టార్ అభిమానులను తనదైన టేకింగ్తో అలరించనున్నాడు.
బ్రహ్మోత్సవం సినిమాలో తొలిసారిగా మహేష్ సరసన ముగ్గురు అందాల భామలు ఆడిపాడనున్నారు. సమంత, కాజల్, ప్రణీతలను హీరోయిన్లుగా ఫిక్స్ చేశారు. పీవీపీ బ్యానర్పై పొట్లూరి వి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీమంతుడుతో సౌత్ ఇండియాలో మంచి మార్కెట్ సాధించిన మహేష్, బ్రహ్మోత్సవం సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళ్లో ఒకేసారి రిలీజ్ చేయాడానికి ప్లాన్ చేస్తున్నాడు.
బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధం
Published Fri, Sep 11 2015 10:05 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM
Advertisement
Advertisement