అది నా బాధ్యత | Karthikeya new movie launch | Sakshi
Sakshi News home page

అది నా బాధ్యత

Published Fri, Dec 28 2018 6:33 AM | Last Updated on Fri, Dec 28 2018 6:33 AM

Karthikeya new movie launch - Sakshi

అర్జున్‌ జంధ్యాల, అనిల్‌ కడియాల, బోయపాటి శ్రీను, కార్తికేయ, తిరుమల్‌ రెడ్డి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

‘‘అనిల్‌ కడియాల, ప్రవీణ కడియాల జంట నాకు టీవీ రంగం ద్వారా ఎప్పటి నుంచో పరిచయం. నేను ఏ సినిమా ఓపెనింగ్‌లకు వెళ్లను. కానీ అనిల్, ప్రవీణల మొదటి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి వాళ్లను మనసారా ఆశీర్వదించటం నా బాధ్యతగా అనిపించింది’’ అని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీఫిలిమ్స్‌ పతాకాలపై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందించారు. దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు హీరోపై క్లాప్‌ ఇచ్చారు. నటులు అలీ, ప్రవీణ కడియాల కెమెరా స్విచ్చాన్‌ చేశారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘నాతో పన్నెండేళ్లుగా అసోసియేట్‌గా ప్రయాణం చేసిన అర్జున్‌ నాకు తమ్ముడులాంటివాడు.

తనలో మంచి టాలెంట్, టైమింగ్‌ ఉంది. ఈ చిత్రనిర్మాతలు నాకు మంచి మిత్రులు. ఈ సినిమా ద్వారా కార్తికేయకి మంచి పేరు వస్తుందని చెప్పగలను’’ అన్నారు. ‘‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం తర్వాత నేను విన్న అన్ని కథల్లో బెస్ట్‌ కథ ఇది’’ అని కార్తికేయ అన్నారు. ‘‘నా గురువు, సోదరుడు అన్నీ బోయపాటిగారే. ఇది నా తొలి సినిమా అయినా ఆయన పేరు ఎక్కడా తగ్గకుండా తీస్తా’’ అన్నారు అర్జున్‌ జంధ్యాల. ‘‘ఈ కథపై ఉన్న నమ్మకంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం’’ అని అనిల్‌ కడియాల అన్నారు. ప్రారంభోత్సవంలో నిర్మాతలు డీవీవీ దానయ్య, మిర్యాల రవీందర్‌ రెడ్డి, ప్రవీణ్, నటి హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరధ్వాజ్, కెమెరా: రామ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ మల్లాల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement