వారంటు ఉన్నా.. కోర్టుకు రానన్న స్వామీజీ! | Defying warrants, Haryana godman not to appear before high court | Sakshi
Sakshi News home page

వారంటు ఉన్నా.. కోర్టుకు రానన్న స్వామీజీ!

Published Mon, Nov 17 2014 10:21 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

వారంటు ఉన్నా.. కోర్టుకు రానన్న స్వామీజీ! - Sakshi

వారంటు ఉన్నా.. కోర్టుకు రానన్న స్వామీజీ!

నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయినా కూడా.. పంజాబ్ హర్యానా హైకోర్టుకు హాజరయ్యేందుకు వివాదాస్పద స్వామి రాంపాల్ నిరాకరిస్తున్నారు. చండీగఢ్లోని హైకోర్టుకు హాజరయ్యేందుకు ఆయన ఆరోగ్యం సహకరించడంలేదని సత్లోక్ ఆశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఆశ్రమం హర్యానాలోని బర్వాలా పట్టణంలో ఉంది. ఆయనను ఈనెల 19వ తేదీ వరకు విశ్రాంతి తీసుకోవల్సిందిగా డాక్టర్లు చెప్పారని, కోర్టులో ఆ మెడికల్ సర్టిఫికెట్లు సమర్పిస్తామని ఆ ప్రతినిధి అన్నారు.

వందలాది మంది భద్రతా సిబ్బంది ఆశ్రమం చుట్టుపక్కల మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వేలాది మంది రాంపాల్ భక్తులు కూడా అక్కడ గుమిగూడారు. హత్యకు కుట్ర పన్నడం, ప్రజలను రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంపాల్ను కోర్టు ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. మూడుసార్లు చెప్పినా కూడా ఆయన కోర్టు ముందుకు రాలేదు. ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావాలని హైకోర్టు గతవారమే పోలీసులకు సూచించింది. ఆయన బంకర్లో దాక్కున్నా కూడా పొగబెట్టి బయటకు తీసుకురావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement