rampal
-
హరియాణాలో డేరా రాజకీయం
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఆధ్యాత్మిక బాట పట్టాయి. డేరాలు, బాబాల చుట్టూ తిరుగుతూ మద్దతు కోసం పోటీ పడుతున్నాయి. హరియాణాలో ఆధ్మాత్మిక సంస్థల ప్రభావం ఓటర్లపై విపరీతంగా ఉంటుంది. తమ ఆ«ధ్యాత్మిక గురువులు ఏ పార్టీకి ఓటు వెయ్యమని చెబితే వారికే గుడ్డిగా ఓటు వేసే అనుచరగణం అధిక సంఖ్యలోనే ఉంది. అందుకే రాజకీయాలన్నీ డేరాల చుట్టూ తిరుగుతున్నాయి. డేరా సచ్చా సౌదా గురువు: గుర్మీత్ రామ్ రహీమ్ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలి జైల్లో ఊచలు లెక్కపెడుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఈ డేరాలో 15 మంది సభ్యులతో కూడిన ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ సమావేశాల్లో వచ్చే ఫలితాలకనుగుణంగా ఏ పార్టీకి మద్దతివ్వాలో నిర్ణయిస్తామని కమిటీ సభ్యుడు జోగిందర్ సింగ్ చెప్పారు. డేరా సచ్చా సౌదా ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాల్లో ఉంది. సత్లోక్ ఆశ్రమ్స్ గురువు: రామ్‌పాల్ ఈ డేరా గురు రామ్‌పాల్ కూడా 2014 నవంబర్ నుంచే జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన రాజకీయాలను శాసిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రామ్‌పాల్ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. కానీ ఈ సారి ఏ పార్టీకి మద్దతివ్వాలో అన్న మీమాంసలో ఉన్నారు. ‘‘లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అంశాల్లో చాలా తేడా ఉంది. అక్టోబర్ 15న సర్వసభ్య సమావేశంలో చర్చించి ఏ పార్టీకి మద్దతునివ్వాలో తేల్చుకుంటాం‘‘అని గురు రామ్‌పాల్ డేరా మీడియా ఇన్చార్జ్ చాంద్ రథి వెల్లడించారు. రోహ్తక్ చుట్టుపక్కలున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురు రామ్‌పాల్ డేరా ప్రభావం ఎక్కువగా ఉంది. డేరా బాబా శ్రీ బాలక్ పురి గురువు: కరణ్ పురి ఈ సారి ఎన్నికల్లో కరణ్ పురి డేరా ఎన్నికలకు దూరంగా ఉండా లని నిర్ణయించుకుంది. హరియాణా లో నివసిస్తున్నా పంజాబీల్లో అధిక ప్రభావం కలిగిన ఈ డేరా తమ అనుచరులకు ఎలాంటి పిలుపు ఇవ్వడం లేదు. అయితే ఈ డేరాను బీజేపీ నాయకులు అత్యధికంగా సందర్శిస్తున్నారు. డేరా గౌకరణ్ ధామ్ గురువు: కపిల్ పురి కాంగ్రెస్‌కు కపిల్పురి మద్దతుదారు. కాంగ్రెస్ నేత భూపీందర్ హూడాకు అనుకూలం. ఈ సారి ఎన్నికల్లో జోక్యం చేసుకోమని చెబుతున్నప్పటికీ బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ గౌకరణ్ ధామ్ డేరా తమ అనుచరగణానికి సంకేతాలు పంపుతోంది. -
చిన్నారుల పట్ల అసభ్య ప్రవర్తన
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం రాంపల్లిలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దారుణానికి పాల్పడ్డాడు. 'ప్రేమాలయం' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న రాంపాల్.. అక్కడ ఉన్న చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. దాంతో వేధింపులు ఎక్కువ కావటంతో ఆ చిన్నారులు ఈ విషయాన్ని చెల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై కీసర పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయ్యింది. కాగా నిర్వాహకుడు రాంపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ పునరావాస కేంద్రంలో ఉన్న 11మంది హెచ్ఐవీ పాజిటివ్ చిన్నారులతో పాటు మరో 18మందిని అక్కడ నుంచి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘సత్యలోకం’ అడుగుజాడల్లో...
చూడబోతే సమాజానికి ఇబ్బందికరంగా మారిన బాబాలను, స్వాములను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన స్థితిలో పడుతున్నట్టుంది. హర్యానాలోని బర్వాలాలో సత్యలోకం పేరిట ఆశ్రమాన్ని నిర్మించుకుని వందలాదిమంది అనుచరులను పోగేసిన బాబా రాంపాల్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టుచేసి కోర్టుముందు హాజరు పరిచేసరికి సర్కారు తల ప్రాణం తోకకొచ్చింది. ఊరు ఊరంతా రణరంగాన్ని తలపించగా... యాసిడ్ సీసాలతో, తుపాకులతో తమపై దాడికి దిగిన రాంపాల్ అనుచరులను దారికి తెచ్చేందుకు పోలీసులు ఎన్నో ఇబ్బందులు పడాల్సివచ్చింది. ఆరుగురు చనిపోయి, అంతా ధ్వంసమయ్యాక లెక్క చూసుకుంటే రూ. 26 కోట్లు ఖర్చయిందని తేలింది. అది పూర్తయి కొద్దిరోజులైనా గడవకుండానే ఈసారి పంజాబ్‌కు అచ్చం అదే మాదిరి సమస్య వచ్చిపడింది. ఈ బాబా వేరు...ఈయన తీరు వేరు. రాంపాల్లా ఈయన జీవించి లేరు. ఈ ఏడాది జనవరి 29న కాలం చేశారు. జలంధర్ సమీపంలో దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్ పేరిట పెద్ద ఆశ్రమాన్ని కట్టుకున్న ఈ బాబా పేరు అశుతోష్ మహరాజ్. ఆయనకు అన్ని మతాల్లోనూ అనుచరులూ, భక్తులు ఉన్నారు. అశుతోష్ మహరాజ్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించడం, ఆయనకు బంధువులుగా చెప్పుకుంటున్నవారు అంత్యక్రియలు పూర్తిచేయాలనుకోవడం...అన్నీ అయ్యాయి. కానీ ఆశ్రమ నిర్వాహకులు, అశుతోష్ భక్తగణం అందుకు ససేమిరా అంగీకరించడంలేదు. బాబా సమాధిలోకి వెళ్లారని... ఆయనకు నిత్య పూజలు, భజనలు చేస్తే ఎప్పుడో మళ్లీ మనల్ని అనుగ్రహించి వెనక్కు వస్తారని చెబుతున్నారు. గతంలో మూడు సందర్భాల్లో ఆయన వారంరోజుల చొప్పున సమాధిలోకి వెళ్లి తిరిగొచ్చారంటున్నారు. అశుతోష్ అనుగ్రహించే సమయానికి భౌతికకాయం పంచభూతాల పాలబడి పాడవకూడదన్న సదుద్దేశంతో దాన్ని గాజు రిఫ్రిజిరేషన్‌లో ఉంచారు కూడా. ఈ రెండు వర్గాలమధ్యా తలెత్తిన తగువు చివరకు హైకోర్టుకెక్కింది. పక్షం రోజుల్లోగా అశుతోష్ భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మన రాజ్యాంగంలోని 51(ఏ)(హెచ్) అధికరణం... శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, జిజ్ఞాసనూ, సంస్కరణభావాన్నీ పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యతగా చెబుతున్నది. కానీ, పౌరులకు అలాంటి బాధ్యత ఉన్నదని పాలకులు చెప్పరు. ఆ బాధ్యతను వారు నెరవేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకోరు. అసలు తాము కూడా ఈ దేశ పౌరులమే గనుక తమకూ అది వర్తిస్తుందని గుర్తించరు. ఎవరి వెనకైనా చెప్పుకోదగిన సంఖ్యలో భక్తులో, అనుచరులో ఉన్నారంటే అలాంటివారి అనుగ్రహాన్ని సంపాదించడానికి వెంపర్లాడతారు. సమస్త యంత్రాంగాన్నీ చేతుల్లో పెట్టుకుని ఏ సమాచారాన్నయినా చిటికెలో తెప్పించుకోగలిగిన స్థితిలో ఉండి కూడా పాలకులు ఇలా ప్రవర్తించడమంటే బాధ్యతారాహిత్యం తప్ప మరేమీ కాదు. వాస్తవానికి అశుతోష్ మహరాజ్ కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. 1998లో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ)తో వైరం ఏర్పడ్డాక ఆయనకు జడ్ సెక్యూరిటీ రక్షణ కల్పించారు. అయిదేళ్లక్రితం రెండు వర్గాలూ ఘర్షణకు దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఒకరు మరణించారు. రాంపాల్‌కు సైతం క్రిమినల్ కేసులో చిక్కుకుని బెయిల్‌పై విడుదలయ్యాక గత నాలుగేళ్లనుంచి కోర్టుకు హాజరుకావడమే మానుకున్నారు. అయినా రాజకీయ నాయకులకూ, ప్రభుత్వంలో ఉన్నవారికీ అలాంటి వ్యక్తితో సన్నిహితంగా మెలగకూడదన్న స్పృహ లేదు. హర్యానాలో రాంపాల్ విషయంలో జరిగిన తప్పే ఇప్పుడు అశుతోష్ ఆశ్రమ వ్యవహారంలో కూడా సాగుతున్నది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్కారు మీనమేషాలు లెక్కిస్తుంటే ఆ ఆశ్రమానికి వెల్లువలా భక్తులు వచ్చిపడుతున్నారు. రాంపాల్ ఆశ్రమానికి కూడా ఇలాగే వేలాదిమంది చేరడంతో ఆయనను అరెస్టు చేయడం ఎంతో కష్టమైంది. ఘర్షణ సమయంలో పిల్లలు, మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. దీన్నుంచి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం తీసుకున్న దాఖలా కనబడ దు. ప్రజల్లో ఆథ్యాత్మిక చింతనను పెంపొందించడానికి, భక్తి మార్గాన్ని బోధించడానికి ఎవరికైనా హక్కుంటుంది. ఆ తరహా సేవను ఎంతో చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న వారు దేశంలో ఎందరో ఉన్నారు. మన రాజ్యాంగంలోని 25, 26 అధికరణాలు నచ్చిన మతాన్ని అనుసరించడానికి, ప్రచారం చేయడానికి స్వేచ్ఛ ఇస్తున్నది. అందులో భాగంగా మతపరమైన, ధార్మికమైన సంస్థలను నెలకొల్పుకోవడానికి, వాటికి ఆస్తులను సమకూర్చుకోవడానికి వీలుకల్పిస్తున్నది. అయితే ఆ వ్యవహారాలన్నీ అమలులో ఉన్న చట్టాలకు లోబడి ఉండాలని అంటున్నది. మన పాలకులు మాత్రం ఆయా మత సంస్థల వ్యవహారాలు ఎలాంటివో తెలియనట్టు నటిస్తున్నారు. పరిమితులకు లోబడి ఉన్నంతవరకూ ఈ నాటకాలవల్ల ఎవరికీ ఇబ్బందులుండవు. కానీ ఒక స్థాయి దాటాక ఆ సంస్థల నిర్వాహకులు తాము అన్నిటికీ అతీతమన్న భ్రమలోకి జారుకుంటారు. వారు ఆ స్థాయికి చేరుకున్నాక చర్య తీసుకోవడం మాట అటుంచి, వారిని ఏమైనా అనడానికి కూడా ప్రభుత్వంలో ఉన్నవారికి ధైర్యం చాలదు. అలా చేస్తే తమకు వచ్చే ఓట్లు కాస్తా ప్రత్యర్థిపక్షానికి పోతాయని భయపడతారు. మొన్న రాంపాల్ ఉదంతంలోనైనా, ఇప్పుడు అశుతోష్ వ్యవహార ంలోనైనా జరుగుతున్నది ఇదే. పంజాబ్, హర్యానాల్లోని అనేక ఆశ్రమాలు సైన్యంలో రిటైరైన సిబ్బందితో తమ అనుచరులకు ఆయుధ శిక్షణనిప్పించుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఇటీవలే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అక్కడ పరిస్థితి ఎంత దిగజారిందో దీన్నిబట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా పాలకులు తమ బాధ్యతను గుర్తెరగాలి. -
చనిపోయి 11నెలలైంది..ఆయన బతికొస్తారా?
ప్రపంచం ఓవైపు సాంకేతికపరంగా దూసుకెళుతుంటే...మరోవైపు ప్రజలు మాత్రం మూఢనమ్మకాలతో సహ జీవనం చేస్తూనే ఉన్నారు. హర్యానాలో వివాదాస్పద గురువు రాంపాల్ ఘటన మరవక ముందే...పంజాబ్‌లోని జలంధర్‌లో మరో సంఘటన చోటుచేసుకుంది. 'స్వామి' భక్తి తారాస్థాయికి చేరటంతో ..చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే జలంధర్‌లో అశుతోష్ మహారాజ్ అనే స్వామీజీ మరణిస్తే ..భక్తులు మాత్రం ఆయనకి అంత్యక్రియలు చేసేందుకు ఇప్పటికీ ఒప్పుకోవటం లేదు. అది కూడా ఒకరోజు...రెండు రోజులు కాదు ఏకంగా...11నెలలుగా స్వామిజీకి అంతిమ సంస్కారాలు నిర్వహించటం లేదు. స్వామీజీ బతికొస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది జనవరి 29 తేదీన అశుతోష్ మహారాజ్ మరణించగా అప్పటి నుంచి ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపరిచారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో హైకోర్టు జ్యోకం చేసుకుని అశుతోష్ మహారాజ్ ..వైద్యపరంగా మరణించినట్లు ప్రకటించినా భక్తులు మాత్రం తమ పట్టు వీడటం లేదు. ఎక్కడ స్వామీజీకి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహిస్తారో అనే భయంతో... ఆయన భౌతికకాయానికి కాపలా కాస్తున్నారు. దాంతో అశుతోష్ మహారాజ్ అంత్యక్రియలు డిసెంబర్ 15లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గత 48 గంటలుగా దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు భారీగా మోహరించారు. కాగా న్యాయస్థానం తీర్పుపై అసంతృప్తిగా ఉన్న కొంతమంది భక్తులు పైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నారు. -
రామ్‌పాల్ అరెస్ట్‌కు రూ. 26 కోట్లు!
పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పణ రామ్‌పాల్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు చండీగఢ్: వివాదాస్పద స్వామీజీ బాబా రామ్‌పాల్ ఆచూకీ కనుగొనడం, అరెస్ట్ చేయడం కోసం చేపట్టిన భారీ ఆపరేషన్‌కు రూ. 26.61 కోట్లు ఖర్చయిందట. ఈ మేరకు శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రామ్‌పాల్‌ను జస్టిస్ ఎం జయపాల్, జస్టిస్ దర్శన్‌సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట హర్యానా పోలీసులు హాజరుపరిచారు. రామ్‌పాల్‌తో పాటు సహ నిందితులైన రామ్కన్వర్ ధాకా, ఓపీ హుడాలను కూడా కోర్టులో హాజరుపరిచారు. హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ఠ్ హిస్సార్ జిల్లా బర్వాలాలోని సత్లోక్ ఆశ్రమంలో చేపట్టిన ఆపరేషన్‌కు సంబంధించిన సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు రామ్‌పాల్ అరెస్ట్‌కు అయిన ఖర్చు వివరాలను పంజాబ్, హర్యానా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించాయి. హర్యానా డీజీపీ కోర్టు సమర్పించిన అఫిడవిట్లో రామ్‌పాల్ ఆపరేషన్ కోసం హర్యానా ప్రభుత్వం రూ.15.43 కోట్లు చేసినట్టు వెల్లడించారు. ఇందులో రూ. 2.19 కోట్ల మేర ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిందని, పోలీసు యంత్రాంగాన్ని తరలించేందుకు రూ. 7 కోట్లు, రైల్వే పోలీసుల కోసం రూ. 1.69 కోట్లు, రవాణా వ్యయం కింద రూ. 2.36 కోట్లు, సిబ్బంది ఆహారానికి రూ. 4.5 లక్షలు ఖర్చయినట్టు తెలిపారు. మరోవైపు రామ్‌పాల్ అరెస్ట్‌కు, కోర్టులో హాజరుపరచడం కోసం ఏర్పాట్లు చేయడానికి పంజాబ్ రూ.4.34 కోట్లు, చండీగఢ్ రూ.3.29 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 3.55 కోట్లు వెచ్చించినట్టు కోర్టుకు తెలిపాయి. నవంబర్ 19న రామ్‌పాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సత్లోక్ ఆశ్రమం వద్దకు రావడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందారు. -
రేపు కోర్టుకు రాంపాల్
ఆశ్రమం నిండా భారీ స్థాయిలో ఆయుధాలు, వంద కోట్లకు పైగా ఆధ్యాత్మిక సామ్రాజ్యం కలిగిన వివాదాస్పద బాబా రాంపాల్‌ను పంజాబ్ హర్యానా హైకోర్టులో శుక్రవారం ప్రవేశపెడుతున్నారు. ఇందుకోసం చండీగఢ్‌లోని కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 2006లో జరిగిన ఓ హత్యకేసులో రాంపాల్‌కు గతంలో మంజూరైన బెయిల్‌ను హైకోర్టు రద్దుచేసింది. నవంబర్ 28న కోర్టులో రాంపాల్‌ను ప్రవేశపెట్టాలని హర్యానా పోలీసులను ఆదేశించింది. హర్యానాలోని హిస్సార్ జిల్లా బల్వారాలో గల రాంపాల్ ఆశ్రమంపై జరిగిన పోలీసు చర్య, ఏయే వర్గాల నుంచి ఎంతమంది గాయపడ్డారనే వివరాలతో కూడిన నివేదికను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని హర్యానా డీజీపీని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను జస్టిస్ ఎం.జయపాల్, జస్టిస్ దర్శన్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం 28కి వాయిదా వేసింది. ఆశ్రమంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఎంత నష్టం జరిగిందో కూడా తెలియజేయాలంది. ఇంతకుముందు మూడుసార్లు కూడా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించినా, ఆరోగ్యం బాగోలేదనే వంకతో రాంపాల్ వాయిదా వేస్తూ వచ్చారు. -
దొంగ దేవుళ్లు మతానికి చేటు
మన దేశంలోని ప్రతి మతంలోనూ బూటకపు దేవుళ్లు, మోసగాళ్లు భక్తులకు తమను తాము హోల్ సేల్‌గా అమ్మేసుకుంటున్నారు. రామ్‌పాల్ లాంటి వ్యక్తి.. విశ్వాసపు ఫ్యాక్టరీనే పెట్టేసి, అసెంబ్లీ లైను మీద అతి సరళమైన పరిష్కారాలను తయారు చేసేసి, నగదు ధర వసూలు చేసి మరీ పేద ప్రజల చేత మింగించేస్తున్నప్పుడు... ఇది ఆందోళన చెందాల్సిన సమయమే. వంచన నీలినీడల్లో జరిగే ఈ భ్రమాత్మక వ్యాపారం భళ్లున బద్దలైనప్పుడు ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించాల్సిందే. కానీ పోలీసు అణచివేత సమాధానం కాదు, ఈ బూటకపు దేవతల నుండి భగవంతుడ్ని కాపాడటం కోసం మన నేతలు నోళ్లు విప్పి తీరాలి. మతానికి ఉండే శక్తి అంతా ప్రశ్నలకు సమాధానాలను చెప్పే దాని సామర్థ్యంలోనే ఉంటుంది. అయినాగానీ అతితరచుగా, ఇప్పుడు హర్యానాలో జరిగినట్టుగా దేవతలమని చెప్పుకునే దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు, ప్రశ్నలను సంధిస్తూనే ఉంటారు. మతం హేతుబద్ధతకు విరుగుడు మందేమీ కాదని కనీసం నా అభిప్రాయం. అయినాగానీ ఆ విషయంలో ఏదో ఓ మూల అపనమ్మకం తొంగి చూస్తూనే ఉంటుంది. విశ్వాసం నుండే మతం పుడుతుంది. విశ్వాసం మానవ మస్తిష్కపు పరిధికి వెలుపల ఉంటుంది. అస్తిత్వ సృష్టిలో భాగమైన మానవుని మెదడు అస్తిత్వపు హేతుబద్ధతను లేదా మరణానికి అర్థాన్ని అవగతం చేసుకోలేనిదని బోధపడే వరకు విశ్వాసం అలా మస్తిష్కానికి వెలుపలే ఉంటుంది. నాస్తికులు మాత్రమే మరణాన్ని విశ్వసిస్తారు. సంశయాత్ములకు మరణమంటే అంతుబట్టని దానిలోకి వేసే అడుగు. ఇక ఆస్తికులకైతే మరణమంటే పరలోకానికి సాగే పరివర్తన. భూమిపై బతికుండగా మనం ఏమి చేశామనే దానికి ఒక విధమైన జవాబుదారీతనం మనం వెళ్లే ఆ పరలోకపు పూర్తి స్వభావాన్ని నిర్ణయిస్తుంది. ఇహలోక, పరలోకాల మధ్య ఈ అనుసంధానానికి హామీ ఉండటమే స్థూలంగా నైతిక వ్యవస్థ అమరికకు దోహదపడుతుంది. అయినప్పటికీ దివ్యశక్తి మానవ స్వేచ్ఛాభీష్టానికి సందును కూడా విడుస్తుంది. అతి కటువైన సన్నటి రేఖ మీదుగా తర్కాన్ని సాగతీస్తే, పాశవికత నాస్తికత్వపు తీవ్ర వ్యక్తీకరణ అని సైతం మనం అనగలుగుతాం. ఎందుకంటే దివ్యశక్తి సృజనాత్మక, ప్రశాంత మేధస్సును తిరస్కరించేవారు మాత్రమే క్రూర చర్యలకు లేదా హత్యలకు లేదా అల్లర్లకు పాల్పడతారు. మరి మతం పేరిట నియంతలు పాశవికతను ప్రదర్శించిన ప్పుడో? అలాంటి నయవంచకుల కోసం ప్రతి మతమూ నరకం అనే ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం కాకతాళీయం కాదు. నైతికతను ఆమోదనీయంగా నిర్వచించడమనేదే బహుశా అత్యంత చిక్కు సమస్య కావచ్చు. అతి తరచుగా అధికారంలోని ఉన్నత వర్గీయులు నైతికతను చెరపట్టి, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు దోహదపడే విధంగా దాన్ని తిరగరాయడం జరిగింది. అలాంటి దురన్యాయానికి ఆచరణాత్మక వాహిక మతమే. కాబట్టే 18వ శతాబ్దపు చివ ర్లో ఫ్రాన్స్ ప్రజలు తిరుగుబాటు చేసి బూర్బన్ రాజులు, రాణులు, ప్రభువుల తలలను ఎంత కసిగా నరికారో, అంతే కసిగా కేథలిక్కు చర్చినీ ధ్వంసం చేశారు. ఆ ఆలోచనను కార్ల్ మార్క్స్ మరొక సున్నితమైన మైలురాయిని దాటించి, మతం ప్రజల పాలిట మత్తుమందు అని నిర్వచించాడు. రెండు సువిశాల ఖండాల్లో, ప్రత్యేకించి తరతరాలుగా పేదలను మేధోపరమైన, ఆర్థికపరమైన మందకొడితనపు మత్తులో ముంచిన సమాజాల్లో మార్క్స్ ఆలోచన... సామాజిక నిర్వహణా చట్రం నుండి మతాన్ని నిషేధించే ప్రతిస్పందనను కలిగించింది. ఫ్రెంచి విప్లవకారులు ఊహించినదాని కంటే చాలా త్వరితంగానే కేథలిక్కు మతం ఫ్రాన్స్‌లో పునఃప్రత్యక్షమైంది. హేతుబద్ధత ముఖ్య ప్రవక్తయైన రోబిస్పియర్ హెర్క్యులస్ తరహాలో ఆల్ఫా దేవతను ఏర్పరచి ఫ్రాన్స్ ప్రజల దేవుని అవసరాన్ని తీర్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆల్ఫా ఆయన తల నేల రాలకుండా కాపాడలేకపోయింది. రష్యాలోని ఆర్థడాక్స్ (సనాతన) క్రైస్తవం, చైనాలోని కన్ఫ్యూషియస్-బౌద్ధం- క్రైస్తవం సుదీర్ఘ మైన, బాధాకరమైన నడిమి వయసు సంక్షోభాలను తట్టుకుని నిలిచాయి. సోవియట్ యానియన్ కాలంలో విజయవంతమైన వ్లాదిమిర్ పుతిన్ నేడు ఆర్థడాక్స్ చర్చికి ప్రణమిల్లి ప్రార్థనలు చేస్తారు. రష్యన్లు రొట్టెతోనే బతకలేరని ఆయనకు తెలుసు.‘‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’’లో ఇటీవల వెలువడ్డ తాజా కథనాన్ని విశ్వసించేట్టయితే... నేటి కమ్యూనిస్టు చైనాలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుల కంటే క్రైస్తవ మతానుయాయులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ వైపరీత్యాన్ని పరిష్కరించడానికి చైనా ప్రభుత్వం ఆసక్తికరమైన డొంక తిరుగుడు దారిని ప్రయత్నిస్తోంది. చైనా, హాంకాంగ్‌లు ఒకే దేశమైనా రెండు రాజ్యాలు. చైనా నాస్తిక రాజ్యం, హాంకాంగ్ మత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలు ఉన్న రాజ్యం. ప్రభుత్వ అధికార అంగాలనన్నిటినీ చైనా ప్రభుత్వం శాసిస్తుంది. ఇక హాంకాంగ్ నాటకీయమైన ప్రత్యామ్నాయాన్ని ప్రదర్శిస్తోంది. భావజాల రణరంగంలో భారీ శతఘు్నలను మోహరిస్తోంది. రాబోయే ఇరవై ఏళ్లలో ఈ రెంటిలో ఏది నెగ్గుతుంది? మీకు పందాలు కాసే అలవాటుంటే హాంకాంగ్ మీదే పందెం కట్టండి. మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక మన దేశానికే వస్తే, మతానికి ఎదురైన ప్రతి సవాలూ ఊపునందుకోకముందే వీగిపోయింది. బెంగాల్‌లోని మార్క్సిస్టులు రాజకీయ పార్టీలను పక్కకు తోసేయగలమేగానీ, మనగలగాలంటే మాత్రం దుర్గాదేవి, కాళికాదేవి ముందు, నమాజుకు పిలుపునిచ్చే మసీదుల హక్కుకు తలవొంచాల్సిందేనని త్వరగానే గుర్తించారు. హిందువులు స్వర్గసీమలోని అమృతం కోసం వేచి చూస్తుండటంతో, ముస్లింలు జన్నత్(స్వర్గం)లోని తస్నీమ్ (పవిత్ర నది)జలాల కోసం దప్పికగొని ఉండటంతో ‘‘మత్తు మందు’’ సిద్ధాంతం చతికిలబడింది. మన దేశంలో ఈ అంశంపై తీవ్ర చర్చలేకపోవడం వల్ల మన వాళ్లలో నయవంచనకు గురయ్యే అవివేకం పెరిగి ఉండాలి. వర్తమాన భారతావనికి నాస్తికత్వం నుంచి లేదా దాని బంధుగణం నుండి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ ప్రతి మతంలోనూ బూటకపు దేవుళ్లు, మోసగాళ్లు మత విశ్వాసులకు హోల్‌సేల్‌గా తమను తాము మార్కెట్ చేసుకుంటున్నారు. దీనివల్ల మాత్రం మతానికి కొంత ముప్పు పొంచి ఉంది. సాధూలు, సావంత్‌లు, ఇమామ్‌లు అంతా అవినీతిపరులు కాని మాట నిజమే. అయినా ఈ ముప్పు గురించి నొక్కి చెప్పక తప్పదు. రామ్పాల్లాంటి వ్యక్తి ఒక విశ్వాసపు ఫ్యాక్టరీనే పెట్టేసి, అసెంబ్లీ లైను మీద అతి సరళమైన పరిష్కారాలను తయారు చేసేసి నగదు ధర వసూలు చేసి మరీ పేద ప్రజల చేత మింగించేస్తున్నప్పుడు.... ఇది ఆందోళన చెందాల్సిన సమయమే. వంచన నీలినీడల్లో జరిగే భ్రమాత్మక వ్యాపారం ఇది. ఈ వ్యాపారం భళ్లున బద్దలైనప్పుడు ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించడానికి తాను చేయాల్సినది చేయకతప్పదు. కానీ పోలీసు అణచివేత సమాధానం కాదు, రాజకీయ నాయకత్వపు ఒప్పించే శక్తి సామర్థ్యాలే పరిష్కారం. తమకు తామే దేవతలుగా ప్రకటించేసుకున్న ఈ బూటకపు దేవతల నుండి భగవంతుడ్ని కాపాడటం కోసం మన నేతలు నోళ్లు విప్పి తీరాలి. ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు -
రామ్‌పాల్ ఆశ్రమంలో ఆయుధాలు!
బర్వాలా: హర్యానాలోని బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్‌పాల్‌కు చెందిన ఆధ్యాత్మిక సామ్రాజ్యం సత్లోక్ ఆశ్రమంలో ఆధునిక ఆయుధాలు దొరికాయి. ఆశ్రమంలో ఆయుధాలు చూసి పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. హర్యానా పోలీసులు ఆదివారం ఆశ్రమాన్ని తనిఖీ చేశారు. ఆశ్రమంలో ఆయుధాలు, నగదు, తూటాల రక్షణ కవచం, కమాండో డ్రెస్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 19న రామ్‌పాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ కస్టడీలో ఉన్న రామ్‌పాల్‌ను ప్రత్యేక దర్యాప్తు బందం (సిట్) అధికారులు ఆదివారం హిసార్‌లోని ఆయన ఆశ్రమానికి తీసుకెళ్లారు. రామ్‌పాల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆశ్రమంలో లాకర్లు, అల్మరాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వాటిని మేజిస్ట్రేట్ సమక్షంలో తెరిచినట్లు పోలీసులు వెల్లడించారు. సోదాల సందర్భంగా నాలుగు .315 బోర్ రైఫిళ్లు, .12 బోర్ తుపాకులు, తూటాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, కమాండో డ్రెస్‌లను గుర్తించినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వాటితోపాటు 32 బోరు రివాల్వర్లు, 19 ఎయిర్ గన్స్, రెండు డబుల్ బేరర్ గన్స్, 4200 కర్రలు, 171 హెల్మెట్లు, రామ్‌పాల్ ప్రైవేట్ కమాండోలు ధరించే 235 జతల యూనిఫామ్, 12 పెట్రోల్ బాంబులు కూడా లభించాయి. వాటినన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామ్‌పాల్ నివాసం ఉండే భవనంలో అత్యాధునిక వసతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్రమంలో తనిఖీలు ఇంకా కొనసాగుతాయని ఆ అధికారి చెప్పారు. ఇదిలా ఉండగా, హర్యానా డీజీపి వశిష్ట, ఐజీపి అనిల్ కుమార్ రావు ఆదివారం ఆశ్రమాన్ని సందర్శించారు. ** -
ఆశ్రమం కాదు.. ఆయుధాగారం!
చండీగఢ్: హర్యానాలోని హిస్సార్ జిల్లా, బల్వారాలో ఉన్న వివాదాస్పద స్వామీజీ రాంపాల్ ఆశ్రమం ఆధ్యాత్మతకు కాకుండా ఆయుధాలకు నిలయంగా కనిపిస్తోంది. రాంపాల్ అరెస్ట్ అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జరుపుతున్న సోదాల్లో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడింది. వాటితో పాటు పెట్రోల్ బాంబులు, యాసిడ్ సిరంజీలు, చిల్లీ గ్రెనేడ్లు కుప్పలుగా కనిపించాయి. రాంపాల్ గది పక్కనే ఉన్న మరో గదిలో గర్భ నిర్ధారణ పరికరం కూడా కనిపించింది. ఆశ్రమంలో మూడు .32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్ గన్లు, 4 రైఫిళ్లు, వివిధ తుపాకులకు వినియోగించే 100కు పైగా క్యాట్రిడ్జ్‌లు లభించాయి. చాలావరకు ఆయుధాలను రెండు ప్రత్యేక గదుల్లోని బీరువాల్లో దాచారు. మందుగుండు సామగ్రిని మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా ఆశ్రమం మధ్యలో ఒక వేదికలాంటి దాన్ని నిర్మించి దానిలోపల దాచిపెట్టారు. ఆ వేదికపై స్వామీజీ ఆసనం ఉండటం వల్ల ఎవరి దృష్టి దానిపై పడదని వారు భావించి ఉంటారని పోలీసులు తెలిపారు. ఆశయం చుట్లూ 50 అడుగుల ఎత్తై ప్రహారీ గోడ, ఆ ప్రహారీ మధ్యలో అక్కడక్కడా వాచ్ టవర్లు, లోపలికి వచ్చేవారిని పరీక్షించేందుకు మెటల్ డిటెక్టర్లు, ఆశ్రమం అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆశ్రమంలో భారీ స్విమింగ్‌పూల్, 24 ఏసీ గదులు, అందులో స్వామీజీ కోసం ప్రత్యేకంగా మసాజ్ రూం కూడా ఉంది. 800 లీటర్ల డీజిల్, భారీ సంఖ్యలో కర్రలు, హెల్మెట్లు, నల్లరంగు దుస్తులు కూడా లభించాయి. లక్షమందికి నెల రోజుల పాటు భోజనం సమకూర్చగల స్థాయిలో ఆహార నిల్వలు కూడా ఉన్నాయి. 1000 బ్రెడ్లను ఒకేసారి తయారుచేయగల మెషీన్ కూడా ఉంది. మొత్తం ఆశ్రమాన్ని సోదా చేసేందుకు మరో రెండు, మూడు రోజులు పడుతుందని సిట్ ప్రతినిధి తెలిపారు. 50 వేల మంది కూర్చోగల ప్రార్థనామందిరంలో ప్రవచనాలు ఇచ్చేందుకు స్వామీజీ కోసం ప్రత్యేకంగా హైడ్రాలిక్ కుర్చీ, దాని చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్ ఉంది. తనిఖీల సందర్భంగా.. స్నానాల గదిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను రక్షించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆశ్రమంలో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. -
స్నానం పాలతో.. ప్రసాదం!
హిస్సార్: అరెస్ట్ అనంతరం రాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భక్త కబీరు ఆధ్యాత్మిక వారసుడిగా ప్రకటించుకున్న రాంపాల్.. భక్తులకు రోజూ అందించే ప్రసాదం ఏంటో తెలుసా?. పాలతో స్నానం చేసి.. ఆ పాలతో ఖీర్ తయారు చేయించి, భక్తులకు క్షీరామృతంగా అందిస్తారు. కాగా త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించవద్దని, భక్త కబీర్‌ను మాత్రమే ఆరాధించాలని రాంపాల్ బోధించేవారు. విగ్రహారాధన లాంటి హిందూ సాంప్రదాయాలను పాటించవద్దనేవారు. అన్ని మత గ్రంధాల్లోనూ భక్త కబీర్‌ను దేవుళ్లకే దేవుడిగా పేర్కొన్నారని వివరించేవారు. ఇక బల్వారాలో 12 ఎకరాల సువిశాల స్థలంలో రాంపాల్ షత్లాక్ ఆశ్రమాన్ని ఆధునిక హంగులతో నిర్మించారు. భారీ స్విమింగ్ పూల్, ముఖ్య అనుచరుల కోసం ఎసీ గదులు ఉన్నాయి. అనుయాయులకు ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ స్క్రీన్లతో లెక్చర్ హాళ్లు ఉన్న ఆధునిక ఆశ్రమం అది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా భారీగానే సమకూర్చుకున్నారని సమాచారం. ఆశ్రమంలో అర్థనగ్నంగా ఉండాలని అక్కడి నిర్వాహకులు తమని వేధించేవారని ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన మహిళలు తెలిపారు. స్వామీజీ వల్ల కొన్ని కుటుంబాలు కూడా నాశనమయ్యాయని వారు చెప్పారు. -
రాంపాల్‌పై కోర్టు ధిక్కార కేసు!
ఇన్నాళ్లుగా మెర్సిడిస్ బెంజిలు, బీఎండబ్ల్యులలో తప్ప తిరగని .. వివాదాస్పద బాబా రాంపాల్‌ను పోలీసులు సాధారణంగా ఖైదీలను తరలించే ట్రక్కులోనే జైలుకు తీసుకెళ్లారు.ఆయన పై మరో కేసు పెండింగులో ఉంది. ఇప్పటివరకు హత్య, ఫోర్జరీ, ఇతర కేసులు మాత్రమే ఉన్నాయనుకుంటే.. ఇప్పుడు కోర్టు ధిక్కార కేసు కూడా విచారణకు వస్తోంది. ఆయనను గురువారం మధ్యాహ్నం కట్టుదిట్టమైన భద్రత మధ్య పంజాబ్ హర్యానా హైకోర్టుకు తీసుకొచ్చారు. 2006లో జరిగిన హత్యకేసులో రాంపాల్ బెయిల్‌ను హైకోర్టు ఇంతకుముందు రద్దు చేసిన విషయం తెలిసిందే. పంచకులలోని ఓ ప్రభుత్వాస్పత్రి నుంచి రాంపాల్‌ను పోలీసు లాకప్‌కు తరలించారు. -
రాంపాల్ బెయిల్ పిటీషన్ కొట్టివేత
-
50 అడుగుల ఎత్తైన ప్రహరీగోడ- సాయుధ ప్రైవేటు సైన్యం!
బల్వారా: హర్యానాలోని బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్‌పాల్‌కు అతి పెద్ద ఆధ్యాత్మిక సామ్రాజ్యమే ఉంది. ఆయనకు చెందిన సత్యలోక్ ఆశ్రమం వద్ద శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు కేంద్రం 500 పారామిలటరీ బలగాలను తరలించిందంటే ఆ సామ్రాజ్యం ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఆశ్రమంలో రామ్‌పాల్ అనుచరులు 15వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆశ్రమం వద్దకు వెళితే ఆయన అనుచరులు పోలీసులపైనే తిరగబడ్డారు. అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసుల ఆదేశాలతో లోపల ఉన్న అనుచరులు తమతమ గ్రామాలకు వెళ్లిపోతున్నారు. సాయుధ బలగాల సహాయంతో హర్యానా పోలీసులు బుధవారం సాయంత్రం రామ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో అతను ముఖానికి వస్త్రం అడ్డుపెట్టుకున్నాడు. అతనిని రేపు కోర్టులో హాజరుపరుస్తారు. అరెస్ట్ సందర్భంగా ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి రామ్‌పాల్ అధిపతి. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో ఉన్న బల్వారాలో అతని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి చుట్టూ 50 అడుగుల ఎత్తైన ప్రహారీ గోడ ఉంది. లోపల 12 ఎకరాల విశాల స్థలం. ముఖ్య అనుచరులకు ఏసీ గదులు. ఎల్ఈడీ స్క్రీన్లు ఉన్న లెక్చర్ హాళ్లు ఉన్న ప్రధాన ఆశ్రమమనే ఆధునిక భవనంలో ఆయన నివాసం. అనుచరులు, సేవకులు, సాయుధ ప్రై వేటు సైన్యంతో పాటు బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ కార్లు ఆయన సేవకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీల్లో 25 లక్షలకు పైగా అనుచరులు, భక్తులున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని సమాచారం. ** -
వివాదాస్పద స్వామీజీ రాంపాల్ అరెస్ట్
-
రామ్‌పాల్ ఆశ్రమం వద్దకు పారామిలటరీ బలగాలు
బల్వారా: హర్యానా బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్‌పాల్ కు చెందిన సత్యలోక్ ఆశ్రమం వద్ద శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు కేంద్రం 500 పారామిలటరీ బలగాలను తరలించింది. హర్యానా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు బలగాలను పంపించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రామ్‌పాల్ ను అరెస్ట్ చేసేందుకు మంగళవారం పోలీసులు ప్రయత్నించగా హింస చెలరేగింది. సత్యలోక్ ఆశ్రమం వద్ద మళ్లీ ఘర్షణలు చోటుచేసుకునే అవకాశముందని నిఘావర్గాలు హెచ్చరించడంతో హోంశాఖ అప్రమత్తమైంది. ఆశ్రమంలో దాదాపు 12 వేల మంది రామ్‌పాల్ అనుచరులు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆశ్రమం ఖాళీచేసి వెళ్లాలని వీరందరినీ పోలీసులు ఆదేశించారు. రామ్‌పాల్ ఇప్పటికీ ఆశ్రమంలోనే ఉన్నారని, ఆయనను అరెస్ట్ చేసే తమ వరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట తెలిపారు. -
స్వామీజీ అరెస్ట్‌పై టెన్షన్!
వివాదాస్పద స్వామి రాంపాల్ ఆశ్రమం వద్ద ఘర్షణలు బర్వాలా(హర్యానా): హర్యానాలో వివాదాస్పద స్వామీజీ రాంపాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ హింసాత్మకంగా మారింది. బర్వాలా పట్టణంలోని స్వామీజీ ఆశ్రమం వద్ద ఆయన అనుచరులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో 200 మంది గాయపడ్డారు. వారిలో స్వామీజీ అనుచరులు, మీడియా ప్రతినిధులే కాకుండా, 100 మందికి పైగా పోలీసులున్నారు. ఆశ్రమానికి ఉన్న 50 అడుగుల ఎత్తైన ప్రహరీ గోడకు ఉన్న ఒక భారీ ద్వారాన్ని ధ్వంసం చేసేందుకు పోలీసులు తీసుకువచ్చిన ఒక జేసీబీ వాహనాన్ని స్వామీజీ అనుచరులు తగులబెట్టారు. ఒక కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి స్వామి రాంపాల్‌పై బెయిల్‌కు వీల్లేని వారంటును జారీ చేసిన పంజాబ్, హర్యానా హైకోర్టు.. శుక్రవారంలోగా ఆయనను కోర్టుకు హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. దాంతో పోలీసులు, పారా మిలటరీ బలగాలు మంగళవారం భారీ ఎత్తున స్వామీజీ ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. మీడియా కూడా భారీగా మోహరించింది. ఆశ్రమం లోపలికి వెళ్లి స్వామీజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను రాంపాల్ అనుచరులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వామి రాంపాల్ ప్రైవేట్ సైన్యం, ఆయన అనుచరులు పోలీసుల పైకి కాల్పులు జరిపారని.. యాసిడ్ సీసాలు, పెట్రోలు బాంబులు, రాళ్లతో దాడి చేశారని రాష్ట్ర డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ తెలిపారు. పెట్రోలు పోసుకుని ఆత్మాహుతి చేసుకునేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని వాటర్ కానన్లతో అడ్డుకున్నామన్నారు. వారి వద్ద పిస్టళ్లు, రివాల్వర్లు, ఇతర మారణాయుధాలు ఉన్నాయన్నారు. వారి దాడిలో చాలామంది పోలీసులు గాయాల పాలయ్యారని, ఒక ఏఎస్ఐ మెడలోకి బుల్లెట్ దూసుకుపోయిందని వివరించారు. పోలీసులు కూడా టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ కానన్లతో స్వామీ రాంపాల్ అనుచరులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఆశ్రమం లోపల పెద్ద ఎత్తున మహిళలు, పసిపిల్లలు ఉన్నందున సంయమనంతో వ్యవహరిస్తున్నామన్నారు. ఆశ్రమం లోపల భారీగా ఎల్పీజీ సిలండర్లు కూడా ఉన్నందున మరింత జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఆశ్రమం లోనే ఉన్న రాంపాల్‌ను అదుపులోకి తీసుకునేంతవరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. విలేకరులపై పోలీసులు దాడి చేస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో, ఆ విషయంపై విచారణ జరుపుతామని వశిష్ట్ తెలిపారు. స్వామీజీ ఆరోగ్యం బాలేదు పోలీసుల దాడిలో ఆశ్రమంలోని నలుగురు మహిళలు మరణించారని ఆశ్రమ ప్రతినిధి రాజ్‌కపూర్ ఆరోపించారు. స్వామీజీ అనారోగ్యంతో ఉన్నారని, ఒక రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చట్టం నుంచి పారిపోయేందుకు స్వామీజీ ప్రయత్నించడం లేదని, ఆరోగ్యం బాగవగానే కోర్టులో హాజరవుతారన్నారు. మరోవైపు, ఆశ్రమంలో వేలాదిగా ప్రజలున్నారని, వారిని స్వామి రాంపాల్ అనుచరులు, ఆయన ప్రైవేటు సైన్యం బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటోందని.. మంగళవారం ఉదయం ఆశ్రమం నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన పలువురు వెల్లడించారు. పరిస్థితిని ముఖ్యమంత్రి ఎమ్ఎల్ ఖట్టర్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఎన్హెచ్ఆర్సీ, పీసీఐ ఖండనలు ఆశ్రమం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడిని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ హర్యానా డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. కోర్టును, చట్టాన్ని గౌరవించాలని, అధికారులకు సహకరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వామీజీ అనుచరులకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ విషయాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీజేపీ విమర్శించింది. -
ఎవరీ రామ్‌పాల్?
బల్వారా(హర్యానా): హర్యానాలో వివాదాస్పద స్వామీజీ రామ్‌పాల్ ఒక్కసారిగా మీడియాకెక్కారు. బల్వారా పట్టణంలోని స్వామిజీ ఆశ్రమం వద్ద మంగళవారం ఆయన అనుచరులకు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఇంతకీ ఈ స్వామిజీ ఎవరు? హర్యానాలోని సోనిపేట జిల్లా గోహనా తహసీల్ ధనానా గ్రామంలో 1951, సెప్టెంబరు 8 ఆయన ఒక రైతు కుటుంబంలో జన్మించారు. రామ్‌పాల్ సింగ్ జతిన్ ఇంజినీరింగ్‌లో డిప్లోమా చేసి, హర్యానా నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా చేరారు. మొదటి నుంచీ ఆధ్మాత్మిక భావాలు ఎక్కువగా ఉన్న రామ్‌పాల్ కొన్నాళ్లకే ఉద్యోగాన్ని వదిలి ఆశ్రమాన్ని స్థాపించారు. ఆయన అనుచరుల్లో నిమ్నవర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. హిందూ మతం బోధించే దేవుళ్లను పూజించడం, ఉపవాసాలు ఉండటం, తదితర మత కార్యక్రమాలు పాటించకూడదని ఆయన తన అనుచరులకు చెప్పేవారు. స్వామీజీపై కేసులే కేసులు! 1999లో రోహ్తక్ జిల్లాలోని కరోంతలో తొలి ఆశ్రమాన్ని ప్రారంభించిన రామ్‌పాల్ కొద్ది కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు ఆశ్రమాలను ప్రారంభించారు. హిస్సార్ జిల్లా బర్వాలాలో ముఖ్య ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కరోంతలో తాను ప్రారంభించిన ఆశ్రమాన్ని ఆర్యసమాజ్ వర్గాలతో ఘర్షణల కారణంగా 2006లో బలవంతంగా మూసివేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ ఆశ్రమంలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి బుల్లెట్ గాయాలతో చనిపోవడం సంచలనమైంది. దాంతో పోలీసులు రామ్పాల్పై హత్యాకేసు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం ఆరోపణల కింద రెండేళ్లు జైళ్లో గడిపి, 2006లో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆశ్రమ భూమికి సంబంధించి ఒక ఫోర్జరీ కేసు కూడా ఆయనపై నమోదైంది. 2013లో ఒక దాడి కేసుతో పాటు ప్రమీలాదేవి అనే ఆర్యసమాజ్ కార్యకర్త హత్య కేసు కూడా రామ్పాల్పై నమోదైంది. ఈ సంవత్సరం జూలైలో స్వామీజీ కోర్టుకు వెళుతుండగా, ఆయన అనుచరులు హిసార్ పట్టణంలో విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనను పంజాబ్, హర్యానా హైకోర్టు సుమోటోగా స్వీకరించి, కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఆయనను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఈ నెల 5న ఆయనపై బెయిల్ పొందేందుకు వీల్లేని వారెంటును జారీ చేసింది. ఈ నెల 10, 17 తేదీలలోనూ ఆయన కోర్టుకు రావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలు చూపుతూ కోర్టుకు హాజరుకాలేదు. దాంతో 21వ తేదీలోపు ఆయనను కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గొడవలు మొదలయ్యాయి. ** -
స్వామీజీ అరెస్ట్‌కు పోలీసుల యత్నం, భక్తుల దాడి
-
స్వామీజీ అరెస్ట్‌కు యత్నం, పోలీసులపై కాల్పులు
చండీగఢ్ : హిస్సార్ జిల్లా బర్వాలాలోని వివాదాస్పద స్వామి రాంపాల్ సత్యలోక్ ఆశ్రమంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులుపై రాంపాల్ చెందిన ప్రైవేటు ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఈ సందర్భంగా పోలీసులకు, భక్తులకు మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు టియర్ గ్యాస్‌తో పాటు లాఠీఛార్జ్ చేశారు. ఇటీవల కోర్టు ధిక్కార కేసులో రాంపాల్‌పై నాన్ బెయిలబుల్ వారంటు జారీ అయిన విషయం తెలిసిందే. హత్యకు కుట్ర పన్నడం, ప్రజలను రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంపాల్‌ను కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే మూడుసార్లు చెప్పినా కూడా ఆయన కోర్టు ముందుకు రాలేదు. దాంతో రాంపాల్‌ను అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావాలని హైకోర్టు గతవారమే పోలీసులకు సూచించింది. ఆయన కోర్టుకు హాజరు కావడానికి సోమవారం చివరి తేది. అయితే కొన్ని గంటలు పోయిన తర్వాత ఆయన తరపు న్యాయవాది ఆయన హాజరు కాలేకపోయిన కారణాన్ని వివరిస్తూ కోర్టుకు తెలియచేశారు. ఈ నేపథ్యంలో రాంపాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు వైద్య చికిత్స నిమిత్త 63 ఏళ్ళ రాంపాల్‌ను గుర్తు తెలియని ప్రాంతంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు ఆశ్రమం తరపు ప్రతినిధి తెలిపారు. -
వారంటు ఉన్నా.. కోర్టుకు రానన్న స్వామీజీ!
నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయినా కూడా.. పంజాబ్ హర్యానా హైకోర్టుకు హాజరయ్యేందుకు వివాదాస్పద స్వామి రాంపాల్ నిరాకరిస్తున్నారు. చండీగఢ్‌లోని హైకోర్టుకు హాజరయ్యేందుకు ఆయన ఆరోగ్యం సహకరించడంలేదని సత్లోక్ ఆశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఆశ్రమం హర్యానాలోని బర్వాలా పట్టణంలో ఉంది. ఆయనను ఈనెల 19వ తేదీ వరకు విశ్రాంతి తీసుకోవల్సిందిగా డాక్టర్లు చెప్పారని, కోర్టులో ఆ మెడికల్ సర్టిఫికెట్లు సమర్పిస్తామని ఆ ప్రతినిధి అన్నారు. వందలాది మంది భద్రతా సిబ్బంది ఆశ్రమం చుట్టుపక్కల మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వేలాది మంది రాంపాల్ భక్తులు కూడా అక్కడ గుమిగూడారు. హత్యకు కుట్ర పన్నడం, ప్రజలను రెచ్చగొట్టడం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంపాల్‌ను కోర్టు ఎదుట హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. మూడుసార్లు చెప్పినా కూడా ఆయన కోర్టు ముందుకు రాలేదు. ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తీసుకురావాలని హైకోర్టు గతవారమే పోలీసులకు సూచించింది. ఆయన బంకర్లో దాక్కున్నా కూడా పొగబెట్టి బయటకు తీసుకురావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
కోహ్లి ‘హ్యాట్రిక్’ మిస్!
ప్రస్తుత జట్టు ఆటగాళ్లలో వైజాగ్ అందరికంటే విరాట్ కోహ్లికి బాగా కలిసొచ్చిన మైదానం. తను ఇక్కడ గతంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో (2010 అక్టోబరు 20న ఆస్ట్రేలియాపై; 2011 డిసెంబరు 2న వెస్టిండీస్‌పై) సెంచరీలు చేశాడు. ఈ సారి కూడా శతకానికి చేరువైన భారత క్రికెట్ సంచలనం దురదృష్టవశాత్తు 99 పరుగుల దగ్గర వెనుదిరిగాడు. తాను మైదానంలో అడుగుపెడితే సెంచరీ ఖాయం... అనే తరహాలో ఇటీవల ఆడుతున్న విరాట్... ఈ మ్యాచ్‌లోనూ నిలకడ చూపించాడు. తాను ఎదుర్కొన్న 32వ బంతికి గానీ తొలి ఫోర్ కొట్టలేదు. చిన్నవే అయినా ధావన్, యువీ, రైనాలతో కలిసి తను నెలకొల్పిన భాగస్వామ్యాలే ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాయి. 64 పరుగుల వద్ద బ్రేవో తన బౌలింగ్‌లోనే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి... తనశైలిలో చూడచక్కని షాట్లతో అలరించి 99 పరుగులు చేశాడు. అప్పటిదాకా సంయమనంతో ఆడినా... రామ్‌పాల్ బంతిని పుల్ చేయబోయి డీప్ ఫైన్‌లెగ్‌లో దొరికిపోయాడు. 6 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్న హోల్డర్ ముందుకు పడుతూ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కోహ్లి వన్డేల్లో తొలిసారి 99 వద్ద అవుటయ్యాడు. లక్ష్మణ్ (2002) తర్వాత విండీస్‌పై ఇలా అవుటైన రెండో భారత ఆటగాడు కోహ్లి. సచిన్ (2007) తర్వాత మరో భారత ఆటగాడు 99 పరుగుల దగ్గర అవుట్ కావడం కూడా ఇదే. దటీజ్ ధోని స్టయిల్ వైజాగ్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ధోని మరోసారి ప్రదర్శించాడు. ఎనిమిదేళ్ల క్రితం ఇదే వేదికపై అద్భుత సెంచరీతో వెలుగులొకొచ్చిన మహీ... ఈ మ్యాచ్‌లోనూ నగర అభిమానులను అలరించాడు. ఇటీవల కాలంలో ధోని ఆటను గమనిస్తే... ఆరంభంలో నెమ్మదిగా ఆడటం, చివర్లో శరవేగంతో పరుగులు చేయడం తన స్టయిల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లోనూ అదే తరహాలో ఆడాడు. తొలి 18 బంతుల్లో అతను చేసినవి 3 పరుగులే. కానీ ఊహించనంత వేగంగా 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.