
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న దళిత నాయకుడు జిగ్నేశ్ మేవానీపై నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జనవరిలో ఓ నిరసన కార్యక్రమంలో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్న కేసు విచారణకు ఆయన గైర్హాజరైనందుకే అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్‌ఎస్ లాంగా మేవానీతో పాటు మరో 12 మందికి వ్యతిరేకంగా ఈ వారెంట్ జారీచేశారు.
నామినేషన్ దఖాలు చేసే పనిలో బిజీగా ఉన్నందున జిగ్నేశ్ రాలేకపోయారని కోర్టుకు ఆయన తరపు న్యాయవాది షంషాద్ పఠాన్ విన్నవించారు. అయితే ఈ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు వ్యతిరేకంగా జనవరి 11న నిర్వహించిన రైల్ రోకో ఆందోళనలో భాగంగా అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను జిగ్నేశ్, ఆయన మద్దతుదారులు నిలిపివేశారు. ఈ కేసులో 40 మంది కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వాద్గామ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జిగ్నేశ్ పోటీచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment