
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.12,700 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల పై ఇక్కడి ప్రత్యేక కోర్టు శనివారం నాన్‌బెయిలబుల్ వారెంట్లు(ఎన్‌బీడబ్ల్యూ) జారీచేసింది. తమ ముందు విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే ట్(ఈడీ) మూడు సార్లు సమన్లు జారీచేసినప్పటికీ వీరిద్దరూ స్పందించకపోవడంతో ఆ సంస్థ ఫిబ్రవరి 27న కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈడీ విజ్ఞప్తి మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద న్యాయ స్థానం నిందితులపై ఎన్‌బీడబ్ల్యూను జారీచేసింది.