
మళ్లీ చిక్కుల్లో సంజయ్ దత్
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ సంజయ్ సంజయ్ దత్ మరో కొత్త చిక్కు వచ్చి పడింది. 1993నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైలు గత ఏడాది విడుదలైన మున్నాభాయ్‌పై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నిర్మాత నిర్మాత షకీల్ నూరాని కేసులో ఈ వారెంట్ జారీ అయింది. విచారణకు సంజయ్ గైర్హాజరు అయినందున కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది.
సంజయ్ దత్ కు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధం ఉందనీ, ఆయన ప్రోద్బలంతోనే తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించిన నూరాని ఈ మేరకు కేసు దాఖలు చేశారు. సంజయ్ తనతో ఒక చిత్రం చేసేందుకు 2002లో ఒప్పందం కుదుర్చుకుని దానిని ఉల్లంఘించారని నూరాని ఆరోపణ. దీనికి సంబంధించి సంజయ్ తనకు 50లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉందని, ఒప్పందం ఉల్లంఘన వల్ల తనకు 2కోట్లు నష్టం వాటిల్లిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా 1993 ముంబై బాంబుపేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నారన్న నేరంపై ఈ హీరోకు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు. 42 నెలల జైలు జీవితం గడిపిన ఆయన సత్ర్పవర్తన కారణంగా ఇంకా ఎనిమిది నెలల శిక్ష మిగిలి ఉండగానే బయటికివచ్చారు. అటు బాలీవుడ్ లో సంజయ్ దత్ బయో పిక్ రూపొందుంతోంది. రియల్ లైఫ్ స్టోరీని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ తెరపైకి తీసుకురాబోతున్నాడు. 'దత్' బయోపిక్ రణబీర్ మేకోవర్ ఫోటోలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.