భూమాపై నాన్‌బెయిలబుల్ వారెంట్
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2015 మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో భూమా నాగిరెడ్డి, డీఎస్పీ దేవదానంకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూమా డీఎస్పీని కులం పేరుతో దూషించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరస్టయిన భూమా బెయిల్ మీద బయటకు వచ్చారు. కాగా, కోర్టు కేసు విచారణకు దాదాపు రెండుమార్లు గైర్హాజరయ్యారు. సోమవారం మరోసారి విచారణకు రాకపోవడంతో మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.