యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదు
కూకట్‌పల్లి మేజి్రస్టేట్ తీర్పును రద్దు చేయండి
హైకోర్టులో ‘అలందా మీడియా’ వాదనలు
ప్రభుత్వానికి, రవిప్రకాశ్‌కు హైకోర్టు నోటీసులు
విచారణ ఈ నెల 5కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: నిధుల దుర్వినియోగం, ఫోర్జరీలకు పాల్పడ్డారంటూ టీవీ9 మాజీ డైరెక్టర్ రవిప్రకాశ్‌పై నమోదైన కేసు ఉపసంహరణకు అనుమతించిన కూకట్‌పల్లిలోని మేజి్రస్టేట్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పి.కౌశిక్ రావు హైకోర్టును ఆశ్రయించారు. రవి ప్రకాశ్‌పై కేసు ఉపసంహరణకు రాష్ట్ర ప్రభుత్వం 2024, మార్చి 15న జీవో 158 జారీ చేసింది. దీని ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెమో దాఖలు చేయగా, కూకట్‌పల్లి కోర్టు తీర్పునిచి్చంది.
ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కౌశిక్‌రావు కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ వేణుగోపాల్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘రవిప్రకాశ్‌పై క్రిమినల్ కేసును మార్చిలో ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీని ఆధారంగా అనుమతిస్తూ మేజి్రస్టేట్ ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధం. కేసు పూర్వాపరాలను, ఇతర అంశాలను పరిశీలించకుండానే ఉత్తర్వుల జారీ సరికాదు. క్రిమినల్ కేసు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు?.. కారణాలు ఏమైనా ఉన్నాయా?.. లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవడంతో పడే ప్రభావాన్ని, చార్జిషీట్‌లోని ఆధారాలను, సాక్షుల స్టేట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదు. మేజి్రస్టేట్ కూడా ఎలాంటి కారణాలను పేర్కొనకుండా మెమోను అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. రవిప్రకాశ్.. నిందితుడిగా ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, మోసానికి పాల్పడటం లాంటి పనులు చేశారని సాక్షులు వాంగ్మూలంలో పేర్కొ న్నారు.
యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేయకూడదన్న సత్యాన్ని మేజి్రస్టేట్ పాటించలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని మేజిస్ట్రేట్ కోర్టు ఇచి్చన ఉత్తర్వులను రద్దు చేయాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, రవిప్రకాశ్, సొంటినేని శివాజీ, జె. కనకరాజు, జె. తేజవర్మ, మహేశ్ గాం«దీకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 5కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment