కనిమొళికి నాన్ బెయిలబుల్ వారెంట్!
న్యూఢిల్లీ: డీఎంకే ఎంపీ కనిమొళికి స్పెషల్ కోర్టులో చుక్కెదురైంది. ప్రత్యేక కోర్టు కనిమొళికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
ఆతర్వాత కనిమొళి న్యాయవాది కోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా, 2జీ స్పెక్ట్రమ్ కేసులో తుది వాదనలు వినడానికి డిసెంబర్ 19 తేదిని ఢిల్లీ కోర్టు ఫిక్స్ చేసింది. ఈ కేసులో మాజీ టెలికాం మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఇతర 15 మందిపై ఆరోపణలెదుర్కొంటున్నారు.