
డీఎంకే ఎంపీ కనిమొళిపై నటి, బీజేపీ నాయకురాలు కుష్బు ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల డీఎంకే పార్టీ ప్రచారకర్త సాధిక్ ఒక కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాళ్లు కుష్బు, గౌతమి, నమిత, గాయత్రి రఘురాంను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అవి పెద్ద దుమారానికే దారి తీశా యి. సాధిక్ వ్యాఖ్యలతో కుష్బు తీవ్రంగానే ఖండించారు. కాగా సాధిక్ వ్యవహారంపై తాజాగా డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు.
(చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత పోటీలో విజయ్, అజిత్ సినిమాలు)
ఏ పార్టీకి చెందిన వారైనా, సందర్భం ఏమైనా మహిళలను అవమానించడం సహించరానిదన్నారు. ఒక స్త్రీగా, మనిషిగా తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్టాలిన్, పార్టీ తరఫున కూడా క్షమాపణ చెప్పుకుంటున్నానని ట్వీట్ చేశారు. కనిమొళి క్షమాపణపై స్పందించిన కుష్బు ధన్యవాదాలు, కానీ మీ మనస్త్వత్వం, ఆచరణకు నిజంగా అభినందనీయం. మహిళల మానానికి, ఆత్మాభిమానానికి మీరెప్పుడు అండగా నిలుస్తారని ట్విట్టర్‌లో ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment