న్యూఢిల్లీ సహారా కేసులో సహారా అధిపతి సుబ్రతారాయ్‌కి ఊరట లభించింది. ఆయన పై జారీ నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను సెబీ కోర్టు రద్దు చేసింది. శుక్రవారం కోర్టు ముందు హాజరైన సహారా చీఫ్ సుబ్రతా రాయ్పై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను ముంబయి ప్రత్యేక సెబీ కోర్టును రద్దు చేసింది. తదుపరి అన్ని విచారణలకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ విచారణను మే 18కి వాయిదా వేసింది. ఆరోపణల పై వాదన ప్రారంభంకానున్నాయి. అయితే రాయ్ లాయర్ చార్జ్‌షీట్ ఇపుడే అందిందని రాయ్ తరపు న్యాయవాది అశోక్ సరోగి తెలిపారు.
ఇన్వెస్టర్లకు రూ.20వేల కోట్లను చెల్లించడంలో విఫలమైన కేసులో కోర్టుముందు హాజరు కావడంతో సుబ్రాతారాయ్‌కు ఫిబ్రవరిలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఎన్‌బీడబ్ల్యుని రద్దు చేయాలని రాయ్ మార్చ్ 31 న హైకోర్టును ఆశ్రయించారు.
సెబీ రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్లకు చెందిన రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి, వందనా భార్గవ లకు సమన్లు జారీ చేసింది. సెక్షన్ 24 కింద సెబీ నిబంధనను ఉల్లంఘించినందుకు రాయ్ తో పాటు మరో ఐదురుగురిపై 2012 లో కేసు నమోదైంది. ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆగష్టు 31, 2012 న సుప్రీంకోర్టు సహారా గ్రూప్ రూ .17,400 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
కాగా సెబీ నిబంధనలకు విరుద్ధంగా సహార పరివార్, సహార హౌసింగ్ సంస్థలు వినియోగదారుల నుంచి కోట్లలో డిపాజిట్లు సేకరించిన కేసులో సుమారు రూ.20 వేల కోట్లను అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంది. అయితే దీనిపై కోర్టు తీర్పును ఉల్లంఘించినందుకు సుబ్రతా రాయ్ 2014 మార్చి 4 నుంచి 2016 మే 6 వరకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తల్లి అంత్యక్రియలకు ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. సెబీకి డబ్బులు చెల్లించేందుకుగాను సుప్రీం కోర్టు ఆయన పెరోల్‌ను పలు మార్లు పొడిగించింది. దీంతో రూ.600 కోట్లను చెల్లించారు. అయితే మిగతా మొత్తం రూ.14,799 కోట్లకుగాను రూ.39 వేల కోట్ల విలువైన ఆస్తులను సుప్రీం కోర్టు అటాచ్ చేసింది. అనంతరం ఏప్రిల్17న సహారాకు చెందిన విలువైన ఆస్తి ఆంబే వాలీని వేలం వేయాల్సింగా ఆదేశించిడంతో పాటు, ఏప్రిల్ 28లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.
సహారా చీఫ్‌కు ఊరట
Published Fri, Apr 21 2017 4:52 PM | Last Updated on Wed, Oct 17 2018 6:34 PM
Advertisement
Advertisement