Sahara chief
-
సహారా చీఫ్‌కు ఊరట
న్యూఢిల్లీ సహారా కేసులో సహారా అధిపతి సుబ్రతారాయ్‌కి ఊరట లభించింది. ఆయన పై జారీ నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను సెబీ కోర్టు రద్దు చేసింది. శుక్రవారం కోర్టు ముందు హాజరైన సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌పై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను ముంబయి ప్రత్యేక సెబీ కోర్టును రద్దు చేసింది. తదుపరి అన్ని విచారణలకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ విచారణను మే 18కి వాయిదా వేసింది. ఆరోపణల పై వాదన ప్రారంభంకానున్నాయి. అయితే రాయ్ లాయర్ చార్జ్‌షీట్ ఇపుడే అందిందని రాయ్ తరపు న్యాయవాది అశోక్ సరోగి తెలిపారు. ఇన్వెస్టర్లకు రూ.20వేల కోట్లను చెల్లించడంలో విఫలమైన కేసులో కోర్టుముందు హాజరు కావడంతో సుబ్రాతారాయ్కు ఫిబ్రవరిలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఎన్బీడబ్ల్యుని రద్దు చేయాలని రాయ్ మార్చ్ 31 న హైకోర్టును ఆశ్రయించారు. సెబీ రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్లకు చెందిన రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి, వందనా భార్గవ లకు సమన్లు జారీ చేసింది. సెక్షన్ 24 కింద సెబీ నిబంధనను ఉల్లంఘించినందుకు రాయ్ తో పాటు మరో ఐదురుగురిపై 2012 లో కేసు నమోదైంది. ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆగష్టు 31, 2012 న సుప్రీంకోర్టు సహారా గ్రూప్ రూ .17,400 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కాగా సెబీ నిబంధనలకు విరుద్ధంగా సహార పరివార్, సహార హౌసింగ్ సంస్థలు వినియోగదారుల నుంచి కోట్లలో డిపాజిట్లు సేకరించిన కేసులో సుమారు రూ.20 వేల కోట్లను అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంది. అయితే దీనిపై కోర్టు తీర్పును ఉల్లంఘించినందుకు సుబ్రతా రాయ్ 2014 మార్చి 4 నుంచి 2016 మే 6 వరకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తల్లి అంత్యక్రియలకు ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. సెబీకి డబ్బులు చెల్లించేందుకుగాను సుప్రీం కోర్టు ఆయన పెరోల్‌ను పలు మార్లు పొడిగించింది. దీంతో రూ.600 కోట్లను చెల్లించారు. అయితే మిగతా మొత్తం రూ.14,799 కోట్లకుగాను రూ.39 వేల కోట్ల విలువైన ఆస్తులను సుప్రీం కోర్టు అటాచ్ చేసింది. అనంతరం ఏప్రిల్17న సహారాకు చెందిన విలువైన ఆస్తి ఆంబే వాలీని వేలం వేయాల్సింగా ఆదేశించిడంతో పాటు, ఏప్రిల్ 28లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. -
రూ.12వేల కోట్లు ఎలా చెల్లిస్తున్నారో చెప్పండి?
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్‌కు పెరోల్ గడువు అక్టోబర్ 24వరకు పొడిగిస్తూ ఊరటనిచ్చిన సుప్రీం, సెబీకి చెల్లించాల్సిన రూ.12వేల కోట్లను ఎలా చెల్లిస్తున్నారో తెలుపాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను సమర్పించాలని ఆయన తరుఫున న్యాయవాదిని సుప్రీం ఆదేశించింది. మరోవైపు పెరోల్ గడువు పొడిగింపు కోసం సుబ్రతా రాయ్ సెబీ వద్ద రూ.200 కోట్లను డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.. కాగ గత శుక్రవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం న్యాయవాదికి, సహారా న్యాయవాదికి మధ్య జరిగిన వాదోపవాదాల నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరోల్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వెంటనే జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించింది. అయితే దీనిపై సుబ్రతా రాయ్ సుప్రీంకు క్షమాపణ చెప్పుకున్నారు. ఇలాంటి తప్పు మరోసారి జరుగదని, తన పెరోల్‌ను తిరస్కరించడాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో పెరోల్ పొడిగింపుపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం, గడువును అక్టోబర్24 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. కాగా నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి సేకరించిన డబ్బు దాదాపు రూ.25,000 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైన కేసులో 2014 లో సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లారు. తల్లి మరణంతో మానవీయ కోణంలో ఈ ఏడాది మే 6న నాలుగు వారాల పెరోల్ సుప్రీం మంజూరు చేసింది. అనంతరం ఆయన చెల్లించాల్సిన మొత్తంలో రూ.10,000 కోట్లలో, సెబీకి రూ .300 కోట్లు డిపాజిట్ చేయాలనే షరతుతో ఆగస్టు 3న రాయ్ పెరోల్ గడువును సెప్టెంబర్ 16 వరకు, ఆ తర్వాత సెప్టెంబర్ 23వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. నేటి విచారణ సందర్భంగా మరోసారి సుబ్రతారాయ్ పెరోల్‌ను పొడిగించింది. -
సహారా చీఫ్‌కు కాస్త ఊరట.. భారీ షాక్
ఒకవైపు ఆనందం, మరోవైపు షాక్ తినడం రెండూ ఒకేసారి వస్తే ఎలా? సహారా చీఫ్ సుబ్రత రాయ్ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. మానవీయ కోణంలో ఆలోచించి సుబ్రత రాయ్ పెరోల్‌ను ఆగస్టు మూడో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. దాన్ని ఆయన దుర్వినియోగం చేయకూడదని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆగస్టు మూడోతేదీ లోగా రూ. 300 కోట్లు కోర్టుకు చెల్లించాలని, లేకపోతే జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. సహారా ఆస్తులన్నింటినీ ఒక రిసీవర్‌కు ఎందుకు అప్పగించకూడదన్న అంశంపై వాదనలను ఆగస్టు మూడో తేదీన కోర్టు వింటుంది. సుబ్రతరాయ్కి ఈ సంవత్సరం మే 6వ తేదీన పెరోల్ వచ్చింది. తర్వాత దాన్ని మే 11న రెండు నెలలు పొడిగించారు. సోమవారంతో ఆ గడువు ముగిసింది. దాంతో ఈ అంశంపై మళ్లీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాయ్‌కి కాస్తంత ఊరట కలిగించేలా పెరోల్ పొడిగించినా, ఆ లోపు రూ. 300 కోట్లు చెల్లించాలంటూ షాకిచ్చింది. -
సహారా సుబ్రత రాయ్‌కి సుప్రీంలో ఊరట
సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతరాయ్కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గురువారం రాత్రి ఆయన తల్లి మరణించడంతో.. ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాలుగు వారాల పెరోల్ మంజూరైంది. అయితే.. పెరోల్ సమయంలో ఆయన మఫ్టీలో ఉన్న పోలీసుల రక్షణలోనే ఉంటారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది. సుబ్రతరాయ్తో పాటు ఆయన అల్లుడు అశోక్ రాయ్ చౌదరికి కూడా అంతే సమయం పాటు పెరోల్ ఇచ్చారు. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే రెండు సంస్థలలో పెట్టుబడి పెట్టినవాళ్లకు ఆ సొమ్ము వెనక్కి ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేకపోవడంతో.. గత రెండేళ్లుగా సుబ్రతరాయ్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. -
విదేశీ హోటళ్ల విక్రయానికి డీల్ ఓకే
న్యూఢిల్లీ: న్యూయార్క్, లండన్లలోని తమ గ్రూప్ మూడు హోటళ్ల విక్రయానికి ఒక పార్టీతో ఒప్పందం కుదిరిందని సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ సుప్రీంకోర్టుకు గురువారం తెలిపారు. రూ.5,000 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి ఒక బ్యాంక్ అంగీకరించిందని కూడా తెలిపారు. అయితే ఒప్పందాలపై సంతకాలు జరిగేంతవరకూ ఈ వివరాలను వెల్లడించలేనని విన్నవించారు. కాగా చర్చల ప్రక్రియను కొనసాగించడానికి వీలుగా రాయ్ కోరిన విధంగా ఆగస్టు 15 నుంచి మరో 15 రోజుల పనిదినాలు తీహార్ జైలులోని కాన్ఫరెన్స్ రూమ్, చర్చలకు సంబంధించిన సౌలభ్యతలను వినియోగించుకోడానికి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు గురువారం అనుమతించింది. దీనితో ఈ చర్చల ప్రక్రియకు మొత్తం 25 రోజుల సమయం ఇచ్చినట్లయ్యింది. అయితే ఇంతకుమించి గడువును పెంచే ప్రశ్నే ఉండబోదని స్పష్టం చేసింది. మదుపరుల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా రూ.24,000 కోట్ల వసూలు, వడ్డీసహా దాదాపు రూ.37,000 కోట్ల పునఃచెల్లింపుల వైఫల్యం కేసులో రాయ్ తీహార్ జైలులో ఐదు నెలలుగా ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ పొందడానికి వీలుగా రూ.10,000 కోట్లు చెల్లించడానికి ఆస్తుల అమ్మకానికి కోర్టు అనుమతించడంతో ప్రతిపాదిత కొనుగోలుదారులతో జైలు కాన్ఫరెన్స్ రూమ్‌లో చర్చలు జరుపుతున్నారు. కాగా తన పారాబ్యాంకింగ్ డివిజన్‌కు చెందిన రెండు లక్షల మంది సభ్యుల ద్వారా రూ.2,500 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల మేర (సభ్యునికి రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకూ) నిధుల సమీకరణకు ఒక ‘కాంట్రిబ్యూషన్ స్కీమ్’ను గ్రూప్‌లో ఒక ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డీకే శ్రీవాస్తవ ప్రతిపాదించారు. అయితే ఇది ఒక వ్యక్తిగత చొరవ తప్ప, మేనేజ్మెంట్తో దీనికి సంబంధం లేదని సహారా ఇండియా ప్రతినిధి తెలిపారు. -
రాయ్ చర్చలకు 10 రోజులు జైలు కాన్ఫరెన్స్ రూమ్
5 నుంచి వినియోగానికి సుప్రీం అనుమతి... న్యూఢిల్లీ: న్యూయార్క్,లండన్లలోని తన మూడు లగ్జరీ హోటళ్లను కొనుగోలు చేయదలచిన వారితో సంప్రదింపులు జరపడానికి సహారా చీఫ్ సుబ్రతారాయ్‌కి ఆగస్టు 5 నుంచి 10 పనిదినాలు తీహార్ జైలు కాన్ఫరెన్స్ రూమ్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ బెయిల్ పొందడానికి రూ.10,000 కోట్ల సమీకరణకు వీలుగా న్యూయార్క్, లండన్లలోని తన హోటల్స్‌సహా దేశీయ ఆస్తుల విక్రయానికి, ఇందుకు ప్రతిపాదిత కొనుగోలుదారులతో చర్చలు జరిపేందుకు జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ సంప్రదింపులకు కాన్ఫరెన్స్ రూమ్‌ను వినియోగించుకోడానికి వీలుగా 4వ తేదీలోపు నోటిఫికేషన్ జారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. షరతులివి...: కేవలం చర్చల నిమిత్తం 10 రోజులే ఆయన కాన్ఫరెన్స్ రూమ్‌లో ఉంటారు. అయితే నిర్ణీత సమయంలోనే ‘కొనుగోలుదారులతో’ సంప్రదింపులు జరపాలి. 10 రోజుల కాలాన్ని సహారా చీఫ్‌కు కాన్ఫరెన్స్ రూమ్‌ను ప్రత్యేక జైలుగా పరిగణించడం జరుగుతుంది. వైఫై, వీడియా కాన్ఫరెన్స్ వంటి సదుపాయాలను చర్చలకు సమకూర్చడం జరుగుతుంది. రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డెస్క్‌టాప్‌లు, ఒక మొబైల్ ఫోన్ వినియోగానికి కోర్టు అనుమతించింది. ఈ సేవలన్నింటికీ సహారా తగిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. -
జైలు కాంప్లెక్స్‌లోనే తగిన ఏర్పాటు!
►ఆస్తుల కొనుగోలుదారులతో సహారా చీఫ్ ►చర్చలపై ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ తన ఆస్తులను కొనుగోలు చేయాలనుకునేవారితో సంప్రదింపులు జరపడానికి వీలుగా తీహార్ జైలు కాంప్లెక్స్‌లో తగిన ఏర్పాటు చేయాలని ఢిల్లీ (ఎన్సీటీ) ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. వ్యక్తిగతంగాకానీ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగానీ ఈ చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని శుక్రవారం సూచించింది. ఈ విషయంపై వేదిక ఏర్పాటుకు జైలు అధికారులను సంప్రదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది. కేవలం ఆస్తులు కొనుగోలుచేయాలనుకునే వారితో చర్చలకు మాత్రమే ఈ ఏర్పాట్లు జరగాలి తప్ప, రాయ్‌కి సౌకర్యవంతమైన ఏర్పాటు చేసేలా ఉండరాదని సైతం నిర్దేశించింది. జైలు కాంప్లెక్‌లోని గెస్ట్ హౌస్ లేదా కోర్ట్ రూమ్‌లో ఆస్తుల కొనుగోలుదారులతో సంప్రదింపులకు ఏర్పాటు చేసుకోవచ్చనీ సుప్రీంకోర్టు తెలిపింది. ఆయా అంశాలపై జూలై 30లోపు తమ స్పందనను తెలియజేయాలని ప్రభుత్వానికి సూచించింది. అంతక్రితం రెగ్యులర్ బెయిల్ వీలుగా రూ.10,000 కోట్లు సమీకరణకు భారత్, విదేశాల్లోని తన ఆస్తుల విక్రయానికిగాను చర్చలకువారంపాటు తనను తీహార్ జైలు గెస్ట్ హౌస్‌కు మార్చాలని రాయ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
ఫారెస్ట్ గెస్ట్ హౌసే.. పోలీస్ కస్టడీ
లక్నో: చట్టం డబ్బున్నోళ్లకు చుట్టం అన్నది నానుడి. మన దేశంలో అరెస్టయినా, పోలీస్ కస్టడీకి తరలించినా ధనవంతులయితే చాలు రాజభోగాలకు ఏమాత్రం లోటు ఉండదు. ఇంట్లో మాదిరే అక్కడా విలాస జీవితం గడపొచ్చు. సహారా చీఫ్ సుబ్రతా రాయ్ విషయంలో ఇది మరోసారి రుజువైంది. సుప్రీం కోర్టు వారెంట్ మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు సుబ్రతా రాయ్‌ను నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన సొంత ఎస్టేట్‌లో ఉన్నారు. పోలీసులు రాయ్‌ను అరెస్ట్ అయితే చేశారు కానీ వెంటనే స్టేషన్‌కు తరలించలేదు. అరెస్ట్ అనంతరం ఆయన ఆరు గంటల పాటు ఎస్టేట్‌లోనే గడిపారు. అనంతరం అనుచరులు వెంటరాగా.. సొంత కాన్వాయ్‌లో అక్కడి నుంచి నేరుగా కోర్టుకు వెళ్లారు. మార్చి 4 వరకు రాయ్‌ను పోలీస్ కస్టడీకి పంపారు. అయితేనేం.. సహారా చీఫ్‌కు వచ్చిన అసౌకర్యమేమీ లేదు. ఆదివారం రాత్రి లక్నోకు 9 కిలో మీటర్ల దూరంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో గడిపారు. రాయ్‌ను గడువు వరకు గృహ నిర్భంధంలో (హౌస్ అరెస్ట్) ఉంచాలంటూ ఆయన తరపు న్యాయవాది విన్నవించారు. ఇందుకు పోలీసులు అంగీకరించడంతో రాయ్‌ను గెస్ట్ హౌస్‌లో ఉంచారు. రాయ్ నిబంధనలకు విరుద్ధంగా మదుపుదారుల నుంచి 25 కోట్ల మేర నిధులు సమకుర్చుకున్నట్టు అభియోగాలు నమోదయ్యాయి.