రాయ్ చర్చలకు 10 రోజులు జైలు కాన్ఫరెన్స్ రూమ్ | Jailed Subrata Roy gets office to negotiate hotel sales | Sakshi
Sakshi News home page

రాయ్ చర్చలకు 10 రోజులు జైలు కాన్ఫరెన్స్ రూమ్

Published Sat, Aug 2 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

రాయ్ చర్చలకు 10 రోజులు జైలు కాన్ఫరెన్స్ రూమ్

రాయ్ చర్చలకు 10 రోజులు జైలు కాన్ఫరెన్స్ రూమ్

5 నుంచి వినియోగానికి సుప్రీం అనుమతి...
 
న్యూఢిల్లీ: న్యూయార్క్,లండన్‌లలోని తన మూడు లగ్జరీ హోటళ్లను కొనుగోలు చేయదలచిన వారితో సంప్రదింపులు జరపడానికి సహారా చీఫ్ సుబ్రతారాయ్‌కి ఆగస్టు 5 నుంచి 10 పనిదినాలు తీహార్ జైలు కాన్ఫరెన్స్ రూమ్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రెగ్యులర్ బెయిల్ పొందడానికి రూ.10,000 కోట్ల సమీకరణకు వీలుగా న్యూయార్క్, లండన్‌లలోని తన  హోటల్స్‌సహా దేశీయ ఆస్తుల విక్రయానికి, ఇందుకు ప్రతిపాదిత కొనుగోలుదారులతో చర్చలు జరిపేందుకు జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ సంప్రదింపులకు కాన్ఫరెన్స్ రూమ్‌ను వినియోగించుకోడానికి వీలుగా 4వ తేదీలోపు నోటిఫికేషన్ జారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
 షరతులివి...: కేవలం చర్చల నిమిత్తం 10 రోజులే ఆయన కాన్ఫరెన్స్ రూమ్‌లో ఉంటారు. అయితే నిర్ణీత సమయంలోనే ‘కొనుగోలుదారులతో’ సంప్రదింపులు జరపాలి. 10 రోజుల కాలాన్ని సహారా చీఫ్‌కు కాన్ఫరెన్స్ రూమ్‌ను ప్రత్యేక జైలుగా పరిగణించడం జరుగుతుంది. వైఫై, వీడియా కాన్ఫరెన్స్ వంటి సదుపాయాలను చర్చలకు సమకూర్చడం జరుగుతుంది. రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డెస్క్‌టాప్‌లు, ఒక మొబైల్ ఫోన్ వినియోగానికి కోర్టు అనుమతించింది. ఈ సేవలన్నింటికీ సహారా తగిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement