Conference Room
-
రాయ్ చర్చలకు 10 రోజులు జైలు కాన్ఫరెన్స్ రూమ్
5 నుంచి వినియోగానికి సుప్రీం అనుమతి... న్యూఢిల్లీ: న్యూయార్క్,లండన్లలోని తన మూడు లగ్జరీ హోటళ్లను కొనుగోలు చేయదలచిన వారితో సంప్రదింపులు జరపడానికి సహారా చీఫ్ సుబ్రతారాయ్‌కి ఆగస్టు 5 నుంచి 10 పనిదినాలు తీహార్ జైలు కాన్ఫరెన్స్ రూమ్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ బెయిల్ పొందడానికి రూ.10,000 కోట్ల సమీకరణకు వీలుగా న్యూయార్క్, లండన్లలోని తన హోటల్స్‌సహా దేశీయ ఆస్తుల విక్రయానికి, ఇందుకు ప్రతిపాదిత కొనుగోలుదారులతో చర్చలు జరిపేందుకు జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ సంప్రదింపులకు కాన్ఫరెన్స్ రూమ్‌ను వినియోగించుకోడానికి వీలుగా 4వ తేదీలోపు నోటిఫికేషన్ జారీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. షరతులివి...: కేవలం చర్చల నిమిత్తం 10 రోజులే ఆయన కాన్ఫరెన్స్ రూమ్‌లో ఉంటారు. అయితే నిర్ణీత సమయంలోనే ‘కొనుగోలుదారులతో’ సంప్రదింపులు జరపాలి. 10 రోజుల కాలాన్ని సహారా చీఫ్‌కు కాన్ఫరెన్స్ రూమ్‌ను ప్రత్యేక జైలుగా పరిగణించడం జరుగుతుంది. వైఫై, వీడియా కాన్ఫరెన్స్ వంటి సదుపాయాలను చర్చలకు సమకూర్చడం జరుగుతుంది. రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు డెస్క్‌టాప్‌లు, ఒక మొబైల్ ఫోన్ వినియోగానికి కోర్టు అనుమతించింది. ఈ సేవలన్నింటికీ సహారా తగిన చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. -
జైల్లో వైఫై, వీడియో కాన్ఫరెన్స్ కావాలట!
న్యూఢిల్లీ: ఆర్ధిక నేరాల ఆరోపణలతో గత మూడు నెలలుగా తీహార్ జైల్లో గడుపుతున్న సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ వైఫై, కాన్ఫరెన్స్ రూమ్ కావాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రతో దాఖలు చేసిన పిటిషన్ పై ఆయన తరపు లాయర్లను, జైలు అధికారులతో సుప్రీం న్యాయమూర్తి విచారించారు. అయితే సుబ్రతో విజ్క్షప్తిపై సమీక్ష నిర్వహిస్తామని సుప్రీం కోర్టు న్యాయమూర్తికి జైలు సీనియర్ అధికారులు తెలిపారు. అయితే కొనుగోలుదారులతో, ఇతర ప్రతినిధులను కలుసుకోవడానికి, చర్చలు జరపడానికి వీడియో కాన్ఫరెన్స్ సేవలు అవసరముందని సుబ్రతో న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఒకవేళ సుప్రీం కోర్టు అనుమతిస్తే.. వైఫై, వీడియో కాన్ఫరెన్స్, లాప్ టాప్ లకు అవసరమయ్యే ఖర్చును సహారా భరించాల్సి ఉంటుందన్నారు. సుబ్రతోను ఎంతమంది సందర్శకులు, ఎన్ని ఎలక్ట్రానికి వస్తువులు, సిబ్బంది సంఖ్యపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా ఓ సమీక్ష నిర్వహించనున్నారు.