జైల్లో వైఫై, వీడియో కాన్ఫరెన్స్ కావాలట!
జైల్లో వైఫై, వీడియో కాన్ఫరెన్స్ కావాలట!
Published Wed, Jul 30 2014 5:45 PM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM
న్యూఢిల్లీ: ఆర్ధిక నేరాల ఆరోపణలతో గత మూడు నెలలుగా తీహార్ జైల్లో గడుపుతున్న సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ వైఫై, కాన్ఫరెన్స్ రూమ్ కావాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రతో దాఖలు చేసిన పిటిషన్ పై ఆయన తరపు లాయర్లను, జైలు అధికారులతో సుప్రీం న్యాయమూర్తి విచారించారు. అయితే సుబ్రతో విజ్క్షప్తిపై సమీక్ష నిర్వహిస్తామని సుప్రీం కోర్టు న్యాయమూర్తికి జైలు సీనియర్ అధికారులు తెలిపారు.
అయితే కొనుగోలుదారులతో, ఇతర ప్రతినిధులను కలుసుకోవడానికి, చర్చలు జరపడానికి వీడియో కాన్ఫరెన్స్ సేవలు అవసరముందని సుబ్రతో న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఒకవేళ సుప్రీం కోర్టు అనుమతిస్తే.. వైఫై, వీడియో కాన్ఫరెన్స్, లాప్ టాప్ లకు అవసరమయ్యే ఖర్చును సహారా భరించాల్సి ఉంటుందన్నారు. సుబ్రతోను ఎంతమంది సందర్శకులు, ఎన్ని ఎలక్ట్రానికి వస్తువులు, సిబ్బంది సంఖ్యపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా ఓ సమీక్ష నిర్వహించనున్నారు.
Advertisement