quashes
-
వడ్డీతో సహా చెల్లించాల్సిందే.. కార్వీ కేసులో బ్యాంకులకు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో బ్యాంకింగ్‌కు అనుకూలంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) బుధవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లు సంయుక్తంగా బ్యాంకులకు కార్వీ తాకట్టు పెట్టిన షేర్లను తిరిగి ఇవ్వాలని లేదా బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కార్వీ రుణదాతలకు (బ్యాంకులకు) ఎన్ఎస్డీఎల్, ఎన్ఎస్ఈ, సెబీలు వార్షికంగా 10 శాతం వడ్డీ సహా షేర్ల విలువ రూ. 1,400 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కేసు వివరాల్లోకి వెళితే... క్లయింట్ సెక్యూరిటీలను కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసిననట్లు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 2019లో ధ్రువీకరించింది. బ్యాంకుల వద్ద రూ.2,300 కోట్లకుపైగా విలువైన ఖాతాదారుల సెక్యూరిటీలను స్టాక్ బ్రోకర్ తాకట్టు పెట్టినట్లు పేర్కొంది. అయితే తాము బ్రోకరేజ్ సంస్థకు ఇచ్చిన రుణాలకుగాను (ప్లెడ్జ్ ఆధారంగా) ఈ తనఖా షేర్లను సర్దుబాటు చేసుకుంటామని యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సెబీని అభ్యర్థించాయి. అయితే దీనిని సెబీ తిరస్కరించింది. తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను బ్యాంకులకు బదిలీ చేయవద్దని రెగ్యులేటర్ డిపాజిటరీని ఆదేశించిన సెబీ, ఈ షేర్లను తిరిగి క్లయింట్ ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని డిపాజిటరీని ఆదేశించింది. దీనితో రుణ దాతలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్‌లో తాజాగా రెండు వేర్వేరు రూలింగ్ ఇస్తూ, సెబీ ఆదేశాలను తప్పుపట్టింది. -
భార్యా హంతకునికి జీవితఖైదు రద్దు: హైకోర్టు సంచలన తీర్పు
బనశంకరి: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో 2016లో వినాయక చవితి రోజున భార్య రాధ వంట చేయకుండా మద్యం తాగి పడుకుంది. కోపోద్రిక్తుడైన భర్త సురేశ్ కట్టెతో దాడిచేయడంతో ఆమె మృతిచెందింది. 2017లో స్థానిక కోర్టు అతనికి యావజ్జీవిత ఖైదు శిక్ష విధించగా అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. అతడు ఈ తీర్పును హైకోర్టులో అప్పీల్ చేశాడు. హైకోర్టు ఏం చెప్పిందంటే మంగళవారం కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే.సోమశేఖర్, టీజీ శివశంకరేగౌడల ధర్మాసనం.. అతడు చేసింది ఉద్దేశపూర్వక హత్యగా పరిగణించలేమని పేర్కొన్నారు. ఈ నేరాన్ని హత్యగా భావించలేమని, కాబట్టి హత్యానేరం సెక్షన్‌ను తొలగించాలని స్పష్టంచేశారు. ఇప్పటికే 6 ఏళ్లు జైలుశిక్ష అనుభవించడంతో, అతనిపై ఎలాంటి కేసులు లేకపోవడంతో తక్షణం జైలు నుంచి విడుద చేయాలని ఆదేశించారు. (చదవండి: ప్రేమిస్తే చంపేస్తారు!) -
కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు భారీ ఊరట!
న్యూఢిల్లీ: ఆర్కాడియా షేర్, స్టాక్ బ్రోకర్లకు సంబంధించిన షేర్ తనఖా కేసులో కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ డిపాజిటరీ సీడీఎస్ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్–ఇండియా) జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. నాన్-ట్రేడింగ్ సభ్యునికి ఆదేశాలు జారీ చేసే అధికారాలు ఎన్ఎస్ఈ, సీడీఎస్ఎల్కు ఉండబోవని అప్పీలేట్ అథారిటీ స్పష్టం చేసింది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కేసు వివరాలు ఇవీ... మార్చి 2008లో, ఆర్కాడియా తన షేర్ల తాకట్టు ఆధారంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి రుణాన్ని పొందింది. తనఖా షేర్ల చట్టపరమైన, ప్రయోజనం పొందిన యజమాని ఆర్కాడియా మాత్రమేనని, సెక్యూరిటీ స్వాధీన చర్యలను బ్యాంక్ చేపట్టకూడదని ఈ మేరకు జరిగిన ఒప్పందం పేర్కొంది. అయితే డిసెంబర్ 2020 నాటికి, ఆర్కాడియా తన రీపేమెంట్ బాధ్యతల విషయంలో విఫలం అవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆర్కాడియాకు బ్యాంక్ 2021 ఫిబ్రవరి 15వ తేదీన తెలియ జేసింది. దీనితో ఆర్కాడియా ఈ వ్యవహారంపై ఎన్ఎస్ఈ న్యాయ విభాగాన్ని ఆశ్రయించింది. తనఖా పెట్టిన ఆర్కాడియా అనుమతి లేకుండా షేర్ల స్వాధీనం కుదరదని ఎన్ఎస్ఈ బ్యాంక్‌కు స్పష్టం చేసింది. ఎన్ఎస్ఈ ఆదేశాల నేపథ్యంలో ఆర్కాడియా డీమ్యాట్ అకౌంట్‌ను సీడీఎస్ఎల్ స్తంభింపజేసింది. దీనితో ఆర్కాడియా తనఖా పెట్టిన షేర్లను బ్యాంక్ తన స్వాధీనంలోకి తీసుకోలేకపోయింది. ఈ వివాదంపై అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కోటక్ బ్యాంక్ ఆశ్రయించింది. (Vivo Y35: స్లిమ్ ఫోన్ ‘వై35’ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?) రూలింగ్ ఇలా... స్టాక్ ఎక్స్చేంజ్గా ప్రతివాది (ఎన్ఎస్ఈ) దాని ట్రేడింగ్ సభ్యులపై మాత్రమే అధికార పరిధిని కలిగి ఉంటుందని శాట్ స్పష్టం చేసింది. ట్రేడింగ్ సభ్యుడు కాని అప్పీలుదారు (కోటక్ మహీంద్రా బ్యాంక్)తో సహా మరే ఇతర సంస్థకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. అదేవిధంగా, డిపాజిటరీ కూడా తన అధికార పరిధిలో లేని ఏ ఇతర సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని, లేదా అప్పీలుదారుకు అనుకూలంగా తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను స్తంభింపజేయ జాలదని స్పష్టం చేసింది.ఆర్కాడియా తనఖా షేర్లపై -
వాన్ పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కు ఊరట
-
తల్లి ఖాతాలో కాదు..కాలేజీ ఖాతాలో జమచేయాలి
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోనే జమచేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది జూన్‌లో జారీచేసిన జీవో 28ని హైకోర్టు రద్దుచేసింది. అదేవిధంగా జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వం చెల్లించిన ఫీజును విద్యార్థి తల్లి కాలేజీకి చెల్లించకపోతే ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదంటూ గత ఏడాది నవంబర్ 6న జారీచేసిన జీవో 64లో పేర్కొన్న క్లాజులన్నింటినీ కొట్టేసింది. ఇకపై జగనన్న విద్యాదీవెన పథకం కింద స్కాలర్‌షిప్పులను, ఫీజులను ఆయా కాలేజీల ఖాతాలకే జమచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమచేసిన డబ్బు విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఈ మొత్తాలను ఆయా విద్యార్థుల నుంచి కాలేజీలే వసూలు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. జీవోలు 28, 64లను సవాలు చేస్తూ అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకృష్ణదేవరాయ ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు ఎస్.హెచ్.ఆర్.ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ విజయలక్ష్మి విచారణ జరిపారు. స్వీయ అవసరాలకు వాడుకునే పరిస్థితులున్నాయి పిటిషనర్ న్యాయవాది మోతుకుమిల్లి విజయకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఫీజులను, స్కాలర్‌షిప్పులను విద్యార్థి తల్లి ఖాతాలో జమచేయడం వల్ల కాలేజీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. గ్రామీణ విద్యార్థుల తల్లులు నిరక్షరాస్యులుగా ఉంటున్నారని, వారి ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో విద్యార్థి చదువుకోసం ప్రభుత్వం జమచేస్తున్న ఫీజుల డబ్బును స్వీయ అవసరాల నిమిత్తం మళ్లించాల్సిన పరిస్థితులు ఉంటున్నాయని చెప్పారు. దీంతో ప్రభుత్వం చెల్లించిన ఫీజు మొత్తం కాలేజీలకు చేరడంలేదని, తల్లి ఫీజు చెల్లించకపోతే తమకు సంబంధం లేదని ప్రభుత్వం జీవో కూడా జారీచేసిందని పేర్కొన్నారు. దీంతో జగనన్న విద్యాదీవెన పథకం తీసుకొచ్చిన సదుద్దేశం నెరవేరకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది తల్లులు ప్రభుత్వం చెల్లించిన ఫీజులను తిరిగి కాలేజీలకు చెల్లించడం లేదో పేర్కొంటూ జిల్లాల వారీగా వివరాలను ఆయన కోర్టు ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? లేదా? కాలేజీలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? తదితరాలను పరిశీలించే నిమిత్తమే తల్లి ఖాతాలో డబ్బు జమచేయడం వెనుకున్న ప్రధాన ఉద్దేశమని చెప్పారు. మహిళా సాధికారతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాలేజీ ఖాతాలో డబ్బు వేస్తే చదువు ఆపేసే అవకాశాలు స్వల్పం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మి.. దాదాపు 40 శాతంమంది విద్యార్థులు ప్రవేశాల సమయంలో ఫీజులు చెల్లించలేదని, ప్రభుత్వ జీవో ప్రకారం ఫీజుల కోసం వారిని కాలేజీలు ఒత్తిడి చేయడానికి వీల్లేదని, తల్లులు ఫీజు చెల్లించకపోతే ప్రభుత్వానిది బాధ్యత కాదని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల వల్ల విద్యార్థి బలవంతంగా చదువు ఆపేయాల్సి వస్తోందని, అంతిమంగా ఓ సీటు వృథా అవుతోందని తెలిపారు. కాలేజీల ఖాతాల్లో డబ్బు జమచేస్తే విద్యార్థి చదువు ఆపేసే పరిస్థితులు చాలా స్వల్పమని చెప్పారు. ఒకవేళ ఆ కాలేజీలో సౌకర్యాలు సరిగా లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులు దానిపై ఫిర్యాదుచేసే అవకాశం ఉంటుందన్నారు. తల్లి ఖాతాలో ఫీజు జమచేయడం వల్ల చదువు కొనసాగింపునకు హామీ లభించడంలేదని చెప్పారు. ఇది జగనన్న విద్యాదీవెన పథకం లక్ష్యానికి విరుద్ధమన్నారు. అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు జస్టిస్ విజయలక్ష్మి తన తీర్పులో పేర్కొన్నారు. -
ఓఎన్జీసీలో మరోసారి గ్యాస్‌లీక్ వార్తలు, కలకలం
సాక్షి, ముంబై: ముంబైలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో మరోసారి ప్రమాదం సంభవించిందన్నవార్తలు కలకలం రేపాయి. గ్యాస్ లీక్ అవుతోందని, చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నట్టు వచ్చిన వార్తలు ప్రకంపనలు పుట్టించాయి. నవీ ముంబైలోని యురాన్ ప్లాంట్ అగ్నిప్రమాదం విషాదం జరిగిన 20 రోజుల్లోనే మరో ఉదంతం అంటూ వచ్చిన పలు నివేదికలు స్థానికుల్లో ఆందోళన పుట్టింటాయి. అయితే ఈ నివేదికలపై ప్రభుత్వ యాజమాన్య సంస్థ స్పందించింది. అలాంటి దేమీలేదని ఆందోళన వద్దని తెలిపింది. సీనియర్ అధికారులు దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. గ్యాస్‌లీక్ లాంటి సంఘటన ఏదీ సంభవించలేదని సంస్థ ట్వీటర్ ద్వారా వివరణ ఇచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సెప్టెంబరు 25 ఉదయం హైడ్రోకార్బన్ వాసన వ్యాపించిందని పేర్కొంది. ఈ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్లాంట్ సాధారణంగా నడుస్తుందని కంపెనీ తెలిపింది. కాగా నవీ ముంబైలోని యురాన్‌లోని ఓఎన్జిసి ప్లాంట్‌లో సెప్టెంబర్ 3న భారీగా మంటలు చెలరేగినఘటనలో నలుగురు మృతి చెందారు. మరణించిన నలుగురిలో ముగ్గురు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. చదవండి : ఓఎన్జీసీ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం At #ONGC Uran plant smell of hydrocarbon felt early Morning which was spread due to incessant rains. There is no leakage. All precautionary measures in place. Plant is running normal.There is nothing to panic. @CMD_ONGC @pallab_ongc — ONGC (@ONGC_) September 25, 2019 -
వైఎస్సార్సీపీ నేతలకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమంగా నమోదైన కేసులో వారికి ఊరట లభించింది. 2015లో ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ఆందోళనకు దిగిన వైఎస్సార్ సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, నారయణస్వామిలతో పాటు మొత్తం 29 మందిపై గతంలో కేసు నమోదు చేశారు. తమపై నమోదైన అక్రమ కేసులకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ నాయకులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసును రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్ల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సాధారణంగా ఏదైనా కేసుతో తమకు ఏమాత్రం సంబంధం లేకున్నా.. తప్పుడు ఆరోపణలున్నా క్వాష్ పిటిషన్ వేస్తారు. సీఆర్పీసీలోని సెక్షన్ 482 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్‌ను కేవలం హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో మాత్రమే వేస్తారు. -
సహారా చీఫ్‌కు ఊరట
న్యూఢిల్లీ సహారా కేసులో సహారా అధిపతి సుబ్రతారాయ్‌కి ఊరట లభించింది. ఆయన పై జారీ నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను సెబీ కోర్టు రద్దు చేసింది. శుక్రవారం కోర్టు ముందు హాజరైన సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌పై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను ముంబయి ప్రత్యేక సెబీ కోర్టును రద్దు చేసింది. తదుపరి అన్ని విచారణలకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ విచారణను మే 18కి వాయిదా వేసింది. ఆరోపణల పై వాదన ప్రారంభంకానున్నాయి. అయితే రాయ్ లాయర్ చార్జ్‌షీట్ ఇపుడే అందిందని రాయ్ తరపు న్యాయవాది అశోక్ సరోగి తెలిపారు. ఇన్వెస్టర్లకు రూ.20వేల కోట్లను చెల్లించడంలో విఫలమైన కేసులో కోర్టుముందు హాజరు కావడంతో సుబ్రాతారాయ్కు ఫిబ్రవరిలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఎన్బీడబ్ల్యుని రద్దు చేయాలని రాయ్ మార్చ్ 31 న హైకోర్టును ఆశ్రయించారు. సెబీ రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పోరేషన్లకు చెందిన రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి, వందనా భార్గవ లకు సమన్లు జారీ చేసింది. సెక్షన్ 24 కింద సెబీ నిబంధనను ఉల్లంఘించినందుకు రాయ్ తో పాటు మరో ఐదురుగురిపై 2012 లో కేసు నమోదైంది. ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఆగష్టు 31, 2012 న సుప్రీంకోర్టు సహారా గ్రూప్ రూ .17,400 కోట్లు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కాగా సెబీ నిబంధనలకు విరుద్ధంగా సహార పరివార్, సహార హౌసింగ్ సంస్థలు వినియోగదారుల నుంచి కోట్లలో డిపాజిట్లు సేకరించిన కేసులో సుమారు రూ.20 వేల కోట్లను అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంది. అయితే దీనిపై కోర్టు తీర్పును ఉల్లంఘించినందుకు సుబ్రతా రాయ్ 2014 మార్చి 4 నుంచి 2016 మే 6 వరకు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తల్లి అంత్యక్రియలకు ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు. సెబీకి డబ్బులు చెల్లించేందుకుగాను సుప్రీం కోర్టు ఆయన పెరోల్‌ను పలు మార్లు పొడిగించింది. దీంతో రూ.600 కోట్లను చెల్లించారు. అయితే మిగతా మొత్తం రూ.14,799 కోట్లకుగాను రూ.39 వేల కోట్ల విలువైన ఆస్తులను సుప్రీం కోర్టు అటాచ్ చేసింది. అనంతరం ఏప్రిల్17న సహారాకు చెందిన విలువైన ఆస్తి ఆంబే వాలీని వేలం వేయాల్సింగా ఆదేశించిడంతో పాటు, ఏప్రిల్ 28లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. -
సర్కార్‌కు చెంప పెట్టు
-
‘ఖడ్గం’ సినిమా ఘర్షణలపై కేసులు కొట్టివేత
హిందూపురం : పట్టణంలో 2002 డిసెంబర్ 21న ‘ఖడ్గం’ చిత్రం ప్రదర్శన సందర్భంగా చెలరేగిన అల్లర్ల కేసును హిందూపురం కోర్టు నిన్న కొట్టి వేసింది. వివరాల్లోకి వెళితే.. 'ఖడ్గం’ చిత్రంలో కొన్ని సన్నివేశాలు మత పరంగా కించపరిచేలా ఉన్నాయన్న నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం ఆందోళనలు, ఘర్షణలకు, పోటాపోటీగా ర్యాలీలు చేశాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జీ, కాల్పులతో పట్టణం అట్టుడికింది. ఈ ఘటనల్లో ఉమర్ ఫరూక్, మాజీ ముతవల్లి అజీజ్, బాబా, ఫరూక్, సాధిక్తో పాటు మొత్తం 53 మందిపై కేసు నమోదయింది. తొలుత ఆందోళన చేసిన కేసులో మాజీ మున్సిపల్ చైర్మన్ విద్యాసాగర్, రమేష్‌రెడ్డి, గోపాల్, నాగరాజు, అశ్వర్థనారాయణ, శివకుమార్, మరో 15 మందిపై కేసు పెట్టారు. మరో వర్గంలోని 56 మందిపై కౌంటర్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పలువురు జైలు పాలయ్యారు. సుదీర్ఘ వాదనల అనంతరం నిందితులపై సాక్ష్యాధారాలు రుజువు కాకపోవడంతో జూనియర్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి గీతా మొదటి కేసులోని 15 మందిపై కేసు కొట్టి వేశారు. తర్వాత కౌంటర్ కేసులోని 36 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ తీర్పునిచ్చారు. కాగా ఉమర్ ఫరూక్, అజీజ్, బాబా వర్గంలోని 26 మందిపై గత జులై నెలలో కోర్టు కేసులు కొట్టి వేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం విముక్తి లభించడంతో బాధితుల కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. -
నీట్ నోటిఫికేషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు