
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమంగా నమోదైన కేసులో వారికి ఊరట లభించింది. 2015లో ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ఆందోళనకు దిగిన వైఎస్సార్ సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, నారయణస్వామిలతో పాటు మొత్తం 29 మందిపై గతంలో కేసు నమోదు చేశారు. తమపై నమోదైన అక్రమ కేసులకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ నాయకులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ కేసును రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పిటిషనర్ల తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
సాధారణంగా ఏదైనా కేసుతో తమకు ఏమాత్రం సంబంధం లేకున్నా.. తప్పుడు ఆరోపణలున్నా క్వాష్ పిటిషన్ వేస్తారు. సీఆర్‌పీసీలోని సెక్షన్ 482 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్‌ను కేవలం హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో మాత్రమే వేస్తారు.