సుబ్రతా రాయ్ పై ఇంక్ పోసి న్యాయవాది నిరసన
సుబ్రతా రాయ్ పై ఇంక్ పోసి న్యాయవాది నిరసన
Published Tue, Mar 4 2014 2:37 PM | Last Updated on Wed, Oct 17 2018 6:34 PM
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆవరణలో సహారా ఇండియా అధినేత సుబ్రతా రాయ్ కి చేదు అనుభవం ఎదురైంది. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటి సిబ్బంది, పెద్ద చేరిన మీడియా ముందు సుబ్రతా రాయ్ పై ఇంక్(సిరా) చల్లి ఓ న్యాయవాది నిరసన వ్యక్తం చేశారు. సుబ్రతాపై ఇంక్ చల్లిన వ్యక్తిని గ్వాలియర్ కు చెందిన న్యాయవాది మనోజ్ శర్మగా గుర్తించారు. సుబ్రతాపై ఇంక్ చల్లి అక్కడి నుంచి కారులో పారిపోయినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.
సుబ్రతా రాయ్ పేద ప్రజలను దోచుకున్నాడు. అతనొక దొంగ అంటూ శర్మ అరిచాడు. ఫిబ్రవరి 28 తేదిన లక్నో పోలీసులు అదుపులోకి తీసుకున్న రాయ్ ను సోమవారం ఉదయం ఢిల్లీకి తీసుకువచ్చారు. ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరుకాకపోవడంతో సుప్రీం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేయడంతో లక్నో పోలీసులు సుబ్రతాను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement