మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
• న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేదని రెండు కోర్టుల వ్యాఖ్యలు
• దేశానికి తిరిగి వచ్చే ఉద్దేశం లేనట్లు కనబడుతోందని ఆగ్రహం
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ ఎగవేతల కేసులో దేశం నుంచి పారిపోరుు బ్రిటన్‌లో ఉంటున్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాపై స్థానిక మెట్రోపాలిటన్ కోర్టులు రెండు వేర్వేరుగా శుక్రవారం నాన్-బెరుులబుల్ వారెంట్లు జారీ చేశారుు. న్యాయవ్యవస్థ పట్ల ఆయనకు గౌరవం లేదని, ఆయనకు భారత్‌కు తిరిగి వచ్చే ఉద్దేశమూ లేనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారుు. ఎటువంటి విచక్షణ లేకుండా మాల్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార ప్రతినిధులను ఆదేశించారుు. రెండు కేసులను వేర్వేరుగా చూస్తే...
ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఫెరా (ఫారిన్ ఎక్సే ్ఛంజ్ రెగ్యులేషన్ యాక్ట్) నిబంధనల ఉల్లంఘనల కేసులో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్‌దాస్ మాల్యాకు నాన్-బెరుులబుల్ వారెంట్ జారీ చేశారు. ఉత్తర్వు అమలు చేయాలని ఈడీని ఆదేశించిన కోర్టు, కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వారుుదా వేసింది.
ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎరుుర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) దాఖలు చేసిన 2012 చెక్ బౌన్‌స కేసుల్లో మరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆనంద్ దాస్ తాజాగా మాల్యాపై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేశారు. వీటిని మాల్యాకు అందేలా చూడాలని హోమ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించారు. కింగ్‌ఫిషర్ రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ డీఐఏఎల్ తాజా కేసు దాఖలు చేసింది. 2012 ఫిబ్రవరి 22న ఇచ్చిన చెక్కు ‘నిధుల లేక’ బౌన్‌స అరుు్యందని సంస్థ కేసు దాఖలు చేసింది. 2012 జూన్‌లో రూ.7.5 లక్షలను రాబట్టుకోడానికి సంబంధించి నాలుగు కేసులను డీఐఏఎల్ దాఖలు చేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వారుుదా వేసింది.