WARRANTS
-
పుతిన్ అరెస్ట్ అవుతారా?.. బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా?
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాదికి పైగా ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్నారు. బాంబులు, ఫిరంగులు, క్షిపణులతో దారుణ కాండ సాగిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా, పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అన్న ధోరణిలో పోతున్నారు. అలాంటి సమయంలో ఐసీసీ ఆయనపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ వారెంట్లతో పుతిన్‌ను అరెస్ట్ చేయొచ్చా ? మాస్కో చెబుతున్నట్టుగా అ వారెంట్లు చిత్తు కాగితాలతో సమానమా? ► పుతిన్‌పైనున్న ఆరోపణలేంటి? ఉక్రెయిన్‌లో ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లల్ని చట్టవిరుద్ధంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి రష్యాకి దాదాపుగా 16,221 మంది తరలివెళ్లారని ఐక్యరాజ్య సమితి విచారణలో తేలింది. ఈ పిల్లల్ని తాత్కాలికంగా తరలిస్తున్నట్టు బయటకి చెబుతున్నారు. కానీ ఆ చిన్నారుల్ని రష్యాలో పెంపుడు కుటుంబాలకు ఇచ్చేసి వారిని శాశ్వతంగా రష్యా పౌరుల్ని చేస్తున్నారు. దీంతో ఉక్రెయిన్‌లో మిగిలిపోయిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది. ఇలా పిల్లల్ని తరలించడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం యుద్ధ నేరం కిందకే వస్తుంది. పిల్లల్ని తరలిస్తున్న సైనికుల్ని, ఇతర అధికారుల్ని నియంత్రించలేకపోయిన పుతిన్ యుద్ధ నేరస్తుడేనని ఐసీసీ చెబుతోంది. పుతిన్‌తో పాటుగా రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా లోవా బెలోవా కూడా సహనిందితురాలుగా ఉంది. ► పుతిన్ అరెస్ట్ అవుతారా? పుతిన్ సొంత దేశంలో అపరిమితమైన అధికారాలను అనుభవిస్తున్నారు. రష్యాలో ఉన్నంత కాలం ఆయన సేఫ్. ఐసీసీకి సొంత పోలీసు బలగం లేదు. ఏ పని చెయ్యాలన్నా సభ్యదేశాలపైనే ఆధారపడుతుంది. రష్యాను వీడి పుతిన్ వేరే దేశానికి వెళితే ఐసీసీ అరెస్ట్ చేయొచ్చు. ఈ అరెస్ట్ వారెంట్ల జారీతో ఆయన విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఏర్పడ్డాయి. అయితే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించడం తెలిసిందే. ఐసీసీ నోటీసులతో అంతర్జాతీయ సమాజం కూడా ఇక పుతిన్ కదలికలను నిశితంగా గమనిస్తుంది కాబట్టి ఆయన వేరే దేశం వెళితే మాత్రం అరెస్ట్ కాక తప్పకపోవచ్చు. ► విచారణ ఎదుర్కొంటారా? పుతిన్ విచారణకు కొన్ని అడ్డంకులున్నాయి. ఐసీసీని రష్యా గుర్తించడంలేదు. అమెరికా, రష్యా వంటి దేశాలు ఇందులో సభ్యులు కావు. ఐసీసీ విచారణ పరిధిని అగ్రరాజ్యం అమెరికా కూడా ఆమోదించడం లేదు. మరో అడ్డంకి ఏమిటంటే ఐసీసీ వాద, ప్రతివాదులిద్దరూ హాజరైతే తప్ప విచారణ కొనసాగించదు. ఎవరైనా విచారణకు గైర్హాజరైతే విచారణ ముందుకు సాగదు. పుతిన్‌ను విచారించాలంటే ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన దేశాల్లో విచారణ చేయొచ్చు. పుతిన్‌ను అలా వేరే దేశానికి తీసుకురావడం అసాధ్యం. ► ఉక్రెయిన్ యుద్ధంపై ప్రభావం ఎంత? ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న అరాచకాలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని మరోసారి పుతిన్‌కు స్పష్టంగా తెలిసేలా, అంతర్జాతీయ సమాజం దీనిపై ఆగ్రహంగా ఉందని సంకేతాలు ఇచ్చేలా ఈ అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి. అయితే రష్యా ఈ వారెంట్లను లెక్క చేయలేదు. తాము ఐసీసీని గుర్తించడం లేదు కాబట్టి ఆ వారెంట్లు చిత్తు కాగితంతో సమానమని మాస్కో పెద్దలు వ్యాఖ్యానించారు. పుతిన్ అధికార ప్రతినిధి ఒకరు ఈ వారెంట్లు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఐసీసీని ఏ మాత్రం పట్టించుకోని పుతిన్ ఈ వారెంట్లకి భయపడి ఉక్రెయిన్ అంశంలో వెనకడుగు వేస్తారని అనుకుంటే పొరపాటేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా ఏ దేశాల నేతలను శిక్షించారు? ► అరాచకాలు సృష్టించిన జర్మనీ నాజీ నాయకుల్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూరెంబర్గ్, టోక్యో ట్రైబ్యునళ్లలో విచారించి శిక్షించారు. నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు కుడిభుజంగా చెప్పుకునే రుడాల్ఫ్ హెస్కి జీవిత ఖైదు పడింది. ► బోస్నియా, రువాండా, కాంబోడియా దేశాల నాయకుల్ని కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లలో విచారించారు ► 1990లో యుగోస్లోవియా ముక్కలైనప్పుడు అక్కడ హింసాకాండను ప్రేరేపించిన ఆ దేశాధ్యక్షుడు స్లొబోదాన్ మిలోసెవిచ్‌ను ఐక్యరాజ్యసమితి హేగ్‌లో విచారించింది. తీర్పు వచ్చేలోపే ఆయన జైల్లో గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో ఏకంగా 90 మందికి శిక్ష పడింది. ► అత్యాచారాలను ప్రేరేపించిన లైబీరియా మాజీ అధ్యక్షుడు చార్లెస్ టేలర్‌కు 50 ఏళ్ల కారాగార శిక్ష విధించారు ► చాడ్ దేశం మాజీ నియంత హిస్సేని హాబ్రేకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ► ఐసీసీ ఏర్పాటయ్యాక 40 మందిపై నేరారోపణలు రుజువయ్యాయి. వీరంతా ఆఫ్రికా దేశాలకు చెందినవారు. ఏమిటీ ఐసీసీ? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) 1998లో ‘‘రోమ్ స్టాచ్యూట్’’ ఒప్పందం కింద ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది. అంతర్జాతీయ సమాజంపైనా, మానవత్వంపైన జరిగే తీవ్రమైన నేరాలు, మారణహోమాలు, యుద్ధనేరాలను విచారించి శిక్షలు విధిస్తుంది.రెండో ప్రపంచ యుద్ధం సమయంలో న్యూరెంబర్గ్ విచారణ తరహాలోనే ఐసీసీ ఏర్పాటైంది. ప్రస్తుతం బ్రిటన్, జపాన్, అఫ్గానిస్తాన్, జర్మనీ సహా 123 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నా యి. రష్యా, అమెరికా దీనిని గుర్తించలేదు. అదే విధంగా భారత్, చైనా కూడా సభ్యత్వాన్ని తీసుకోలేదు. తీవ్రమైన నేరాల విషయాల్లో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలు విచారణలో విఫలమైతే ఐసీసీ జోక్యం చేసుకుంటుంది. -
కోల్డ్ వార్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కీలక విభాగాలైన రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. మీ కోసం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి తన ఆదేశాలను పాటించని 8 మంది ఎస్సైలకు జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రకటించడం పోలీస్ విభాగంలో కలకలం రేపింది. తమ శాఖపై కలెక్టర్ పెత్తనం ఏమిటంటూ పోలీసు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాకు కలెక్టర్ ముఖ్య అధికారి కాగా, ఆ తర్వాత స్థానం ఎస్పీదే. జిల్లాకు కలెక్టర్, ఎస్పీలు రెండు కళ్లులా వ్యవహరిస్తుంటారు. ఒకరిపై మరొకరు పెత్తనం చేసే అవసరం, అవకాశం ఎప్పుడూ రావు. అటువంటిది ఏకంగా 8 మంది ఎస్సైలకు అరెస్ట్ వారెంట్లు ఇస్తున్నట్టు కలెక్టర్ భాస్కర్ ప్రకటించడంపై పోలీసు శాఖలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేయడం కుదరదని, సివిల్ అంశాల్లో అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తాము ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. క్రిమినల్ కేసుల్లో స్పందించినంత వేగంగా సివిల్ కేసుల్లో స్పందిస్తే కోర్టుల్లో ఇబ్బందులు వస్తాయని వారు అంటున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే మీ కోసం కార్యక్రమంలో వచ్చే విజ్ఞాపనలపై సాధ్యమైనంత వరకూ స్పందిసూ్తనే ఉంటామని, అయితే లిటిగేషన్ ఉన్న కేసుల్లో వెంటనే స్పందించడం సాధ్యం కాదని వారు చెబుతున్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించడంపై వారు పెదవి విరుస్తున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించాలి్సన కేసులను తమపైకి నెట్టివేసి చేతులు దులుపుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. మీ కోసం కార్యక్రమానికి ప్రజల నుంచి పోలీసులపై ఏ స్థాయిలో ఫిర్యాదులు వస్తాయో, జిల్లా ఎస్పీ నిర్వహించే ఫోన్ ఇన్ కార్యక్రమాలకు కూడా రెవెన్యూ విభాగంపై అదేస్థాయిలో ఫిర్యాదులు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. రెవెన్యూపై ఫిర్యాదులు వస్తే వాటిని ఆ శాఖాధికారులకు పంపి పరిష్కరించమని చెబుతామే తప్ప తాము జోక్యం చేసుకుని రెవెన్యూ అధికారులపై కేసులు పెట్టడం లేదని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తలెత్తిన వివాదం వల్ల రెండు శాఖల మధ్య అంతరం పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ విజయవాడలో మూడు రోజులపాటు జరిగే సదస్సులో పాల్గొనడానికి వెళ్లారని, ఆయన తిరిగొచ్చాక ఈ విషయాన్ని తెలియజేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలి్సన రెండు ప్రధాన శాఖలు ఘర్షణ వైఖరికి పోకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు
• న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేదని రెండు కోర్టుల వ్యాఖ్యలు • దేశానికి తిరిగి వచ్చే ఉద్దేశం లేనట్లు కనబడుతోందని ఆగ్రహం న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ ఎగవేతల కేసులో దేశం నుంచి పారిపోరుు బ్రిటన్‌లో ఉంటున్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాపై స్థానిక మెట్రోపాలిటన్ కోర్టులు రెండు వేర్వేరుగా శుక్రవారం నాన్-బెరుులబుల్ వారెంట్లు జారీ చేశారుు. న్యాయవ్యవస్థ పట్ల ఆయనకు గౌరవం లేదని, ఆయనకు భారత్‌కు తిరిగి వచ్చే ఉద్దేశమూ లేనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారుు. ఎటువంటి విచక్షణ లేకుండా మాల్యాపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార ప్రతినిధులను ఆదేశించారుు. రెండు కేసులను వేర్వేరుగా చూస్తే... ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఫెరా (ఫారిన్ ఎక్సే ్ఛంజ్ రెగ్యులేషన్ యాక్ట్) నిబంధనల ఉల్లంఘనల కేసులో చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్‌దాస్ మాల్యాకు నాన్-బెరుులబుల్ వారెంట్ జారీ చేశారు. ఉత్తర్వు అమలు చేయాలని ఈడీని ఆదేశించిన కోర్టు, కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వారుుదా వేసింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎరుుర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) దాఖలు చేసిన 2012 చెక్ బౌన్స కేసుల్లో మరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆనంద్ దాస్ తాజాగా మాల్యాపై ఎన్బీడబ్ల్యూ జారీ చేశారు. వీటిని మాల్యాకు అందేలా చూడాలని హోమ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించారు. కింగ్‌ఫిషర్ రూ. కోటి రూపాయలు ఇవ్వాలంటూ డీఐఏఎల్ తాజా కేసు దాఖలు చేసింది. 2012 ఫిబ్రవరి 22న ఇచ్చిన చెక్కు ‘నిధుల లేక’ బౌన్స అరుు్యందని సంస్థ కేసు దాఖలు చేసింది. 2012 జూన్‌లో రూ.7.5 లక్షలను రాబట్టుకోడానికి సంబంధించి నాలుగు కేసులను డీఐఏఎల్ దాఖలు చేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వారుుదా వేసింది. -
మాజీ ఎంపీ హర్షకుమార్కు వారెంట్
విశాఖ లీగల్: ఒక క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్న పార్లమెంటు మాజీ సభ్యుడు కె.హర్షకుమార్, మరికొందరికి వారెంట్లు జారీ చేస్తూ నగరంలోని నాలుగవ అదనపు ప్రధాన మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2004 అక్టోబర్‌లో పార్లమెంట్‌సభ్యునిగా ఎన్నికైన హర్షకుమార్‌ను నగరంలోని వుడా చిల్డ్రన్ థియేటర్లో సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తనను హర్షకుమార్ మద్దతుదారులు తనను కులం పేరుతో దూషించి, దాడిచేశారని కృష్ణ స్వరూప్ అనే వ్యక్తి కిమినల్ కేసు దాఖలు చేశారు. నేరారోపణ ఎదురొంటున్న హర్షకుమార్, మాజీ మంత్రి కోండ్రు మురళీ, మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబులు కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి బెయిలుకు వీలుకాని వారెంటు జారీచేశారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం మార్చి 22వ తేదీకి వాయిదా వేశారు.