విశాఖ లీగల్: ఒక క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్న పార్లమెంటు మాజీ సభ్యుడు కె.హర్షకుమార్, మరికొందరికి వారెంట్లు జారీ చేస్తూ నగరంలోని నాలుగవ అదనపు ప్రధాన మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2004 అక్టోబర్‌లో పార్లమెంట్‌సభ్యునిగా ఎన్నికైన హర్షకుమార్‌ను నగరంలోని వుడా చిల్డ్రన్ థియేటర్‌లో సన్మానించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన తనను హర్షకుమార్ మద్దతుదారులు తనను కులం పేరుతో దూషించి, దాడిచేశారని కృష్ణ స్వరూప్ అనే వ్యక్తి కిమినల్ కేసు దాఖలు చేశారు. నేరారోపణ ఎదురొంటున్న హర్షకుమార్, మాజీ మంత్రి కోండ్రు మురళీ, మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబులు కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి బెయిలుకు వీలుకాని వారెంటు జారీచేశారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం మార్చి 22వ తేదీకి వాయిదా వేశారు.
మాజీ ఎంపీ హర్షకుమార్‌కు వారెంట్
Published Fri, Feb 26 2016 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM
Advertisement