
సాక్షి,న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్స్ కేసుకు సంబందించి ముగ్గురు యూరప్ దళారులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇదే కేసులో మాజీ ఎయిర్‌చీఫ్ ఎస్‌పీ త్యాగి సహా ఇతర నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దాఖలైన చార్జిషీట్ ఆధారంగా వారికి నాన్ బెయిలబుల్ వారెంట్లు, సమన్లు జారీ చేసినట్టు సీబీఐ తెలిపింది.
యూరప్‌కు చెందిన దళారుల్లో కార్లో ఎఫ్ జెరోసా, క్రిస్టియన్ మైఖేల్,గిడో హష్కీ ఉన్నారు. యూపీఏ 2 హయాంలో 12 వీవీఐపీ హెలికాఫ్టర్ల కొనుగోలు ప్ర్రక్రియలో ముడుపులు స్వీకరించారనే ఆరోపణలపై త్యాగి సహా ఐదుగురు విదేశీయులతో పాటు తొమ్మిది మందిపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. రూ 3726 కోట్ల విలువైన వీఐపీ చాపర్ ఒప్పందానికి సంబంధించి దాదాపు రూ 2666 కోట్ల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని చార్జిషీట్ అంచనా వేసింది. ఎయిర్ మార్షల్ జేఎస్ గుజ్రాల్, త్యాగి కజిన్ సంజీవ్ త్యాగి, దళారి గౌతమ్ ఖైతాన్‌ల పేర్లు కూడా చార్జిషీట్‌లో నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment