
సాక్షి, ఖమ్మం : ఖమ్మం కోర్టుకు హాజరైన కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరిపై గత నెలలో జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎత్తివేసింది. గతంలో రేణుకా చౌదరిపై నమోదైన ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో గత నెల 29న ఖమ్మంకోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి సోమవారం రేణుకాచౌదరి ఖమ్మం రెండో అదనపు జూనియర్ సివిల్‌జడ్జి కోర్టులో హాజరయ్యారు. కేసు వివరాలు పరిశీలించిన అనంతరం రేణుకాచౌదరిపై గతంలో జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జడ్జి ఎత్తివేస్తూ రీకాల్ చేశారు. వచ్చే నెల 17వ తేదీకి కేసు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment