సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరు నాయకులు సై అంటే సై అంటున్నారు. ఖమ్మం వేదిక నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి నిరుద్యోగ ర్యాలీలో మంత్రి అజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రేణుకా చౌదరి.
అరే మంత్రి అజయ్ అని సంబోధిస్తూ.. అజయ్‌ను పాతాళంలోకి తొక్కలని వ్యాఖ్యలను చేశారు. ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్ గుట్టలను మింగేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని, పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు పువ్వాడ తీవ్రస్థాయిలో కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. దమ్ముంటే రేణుక తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
‘చిల్లరమల్ల మాటలు కాదు నువ్వు నా మీద రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నాకు సంస్కారం ఉంది. నా తల్లిదండ్రులు అది నాకు నేర్పించారు. నాకు రేణుక చౌదరి లాగా మాట్లాడటం రాదు. న్యాయపరంగా నీచులపై పోరాటం చేస్తాను.
అజయ్ కుమార్‌ను మాటలు అనడమే లక్ష్యంగా ఖమ్మంలో రాజకీయాలు చేస్తున్నారు. ప్రత్యర్ధులకు కలలో కూడా నేనే వస్తున్నట్లు ఉంది. రేణుకా చౌదరి అంటే పబ్భులు, గబ్భులు చరిత్ర అని ఫైర్ అయ్యారు మంత్రి. కేంద్రమంత్రిగా చేసిన నువ్వు ఖమ్మం జిల్లాకు చేసింది ఏంటి? ఖమ్మానికి గుండు సున్నా చూపించిన ఘనత రేణుకా చౌదరికే దక్కుతుంది’ అని మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు.
చదవండి: Karnataka: సిద్ధరామయ్యకు మద్దతుగా జగదీష్ శెట్టర్..
Comments
Please login to add a commentAdd a comment