
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సభ, హస్తం పార్టీలోకి కీలక నేతలు చేరుతున్న సందర్బంగా పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. పొంగులేటితో పాటు ఆయన అనుచరులను టార్గెట్ చేస్తూ పోస్టర్లు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. పొంగులేటి ఖబడ్దార్ అంటూ పోస్టర్లలో రాసి ఉండటం సంచలనంగా మారింది.
మరోవైపు.. పొంగులేటి అనుచరుడు డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వ విజయబాబుకు వార్నింగ్ లేఖ కూడా వచ్చింది. ఇక, ఆ లేఖలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలంటూ హెచ్చరించారు. చీకటి కార్తిక్‌కు పట్టిన గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో వారి శవాలు కూడా దొరకవు అంటూ రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సభ వేళ బీఆర్‌ఎస్ బిగ్ షాక్