సాక్షి, హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుకేష్ గుప్తాకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కోర్టు సోమవారం షాక్ ఇచ్చింది. కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటూ తిరుగుతున్న సుకేశ్ గుప్తాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా పరారీలో ఉన్న సుఖేశ్ గుప్తా ఇండియా నుంచి దుబాయ్‌కి పారిపోయి తలదాచుకున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కాగా 275 కోట్ల రూపాయల స్కాం లో సుకెష్ గుప్తా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై గతంలో సుఖేశ్ గుప్తాకు ఈడీ అధికారులు సమన్లు కూడా జారీ చేశారు. కాగా ఈడీ ఇచ్చిన సమన్లపై సుఖేశ్ గుప్తా హైకోర్టును ఆశ్రయించి స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ సుఖేశ్ గుప్తా పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అప్పటినుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న సుఖేశ్ గుప్తాకు ఈడీ కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment