సుబ్రతారాయ్ అరెస్ట్ కు రంగం సిద్ధం
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్ అరెస్ట్కు సుప్రీంకోర్టు బుధవారం నాన్బెయిల్బుల్ అరెస్ట వారెంట్ జారీ చేసింది. సుప్రీంకోర్టులో బుధవారం జరగనున్న విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన కోర్టుకు హాజరుకాకపోవడంతో ధిక్కార నేరంగా సుప్రీం కోర్టు పరిగణించింది. దాంతో సుబ్రతారాయ్ అరెస్ట్కు నాన్బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో రాయ్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది.
మదుపరులకు చెల్లించాల్సిన రూ. 20 వేల కోట్లు చెల్లించాలని సహారా గ్రూప్ను గతంలో సుప్రీం ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను సహారా గ్రూప్ పెడచెవిన పెట్టింది. దాంతో బుధవారం వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాయ్ బుధవారం కూడా హాజరుకాకపోవడంతో సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులోభాగంగా నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ చేసింది.