సుబ్రతారాయ్కు పెరోల్ పొడిగింపు
• ఫిబ్రవరి 6లోపు రూ.600 కోట్లు డిపాజిట్ చేయాలి
• లేకుంటే జైలుకేనని సుప్రీంకోర్టు హెచ్చరిక
న్యూఢిల్లీ: సహారా గ్రూపు అధినేత సుబ్రతారాయ్‌కు సుప్రీంకోర్టు మరోసారి పెరోల్ పొడిగించింది. వచ్చే ఫిబ్రవరి 7 వరకు పొడిగించిన ధర్మాసనం ఆ తర్వాత కూడా జైలు బయటే ఉండాలంటే రూ.600 కోట్లను సెబీ-సహారా రిఫండ్ ఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. విఫలమైతే జైలుకు వెళ్లాల్సి ఉం టుందని హెచ్చరించింది. అదే సమయంలో జైల్లోనే ఉంచాలని తాము కోరుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆధ్వర్యంలోని ధర్మాసనం సోమవారం ఈ కేసును విచారించగా... ఆస్తులను అమ్మి, ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేయడం చేతకాకపోతే ఆ పని చేసేందుకు ప్రాపర్టీ రిసీవర్ నియామకాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.
తొలుత రూ,1000 కోట్లను డిపాజిట్ చేయాలని సుబ్రతారాయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌ను ఆదేశించిన కోర్టు లేదంటే ప్రాపర్టీ రిసీవర్‌ను నియమిస్తామని పేర్కొంది. తర్వాత దాన్ని రూ.600 కోట్లకు తగ్గించింది. రూ.1.87 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయన్న గ్రూపు ఇప్పుడు బకారుులు చెల్లించలేకపోవడం ఏంటన్న ధర్మాసనం.. జైలు నుంచి విముక్తి పొందిన తర్వాత రాయ్ ఎంత డిపాజిట్ చేశారని కోర్టు ప్రశ్నించింది. రూ.11,000 కోట్లను డిపాజిట్ చేసినట్టు, ఇంకా రూ.11,136 కోట్లు చెల్లించాల్సి ఉందని సిబల్ తెలిపారు. సెబీ లెక్క ప్రకారం బకారుులు రూ.14,000 కోట్లు ఉన్నాయన్నారు.
21 వారుుదాల్లో బకారుులన్నీ చెల్లించేస్తాం...
సెబీకి రూ.11,136 కోట్ల బకారుులు చెల్లించే విషయంలో కార్యాచరణ ప్రణాళికను సహారా గ్రూపు సోమవారం సుప్రీం కోర్టుకు సమర్పించింది. రెండున్నరేళ్ల కాల వ్యవధిలో మొత్తం బకారుులను 21 వారుుదాల్లో చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు అనుమతించాలని, మొత్తం బకారుులను చెల్లించాక సుబ్రతారాయ్‌తోపాటు గ్రూపు డెరైక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవిశంకర్ దూబేలను పూర్తి స్థారుులో విడుదల చేయాలని కోర్టుకు విన్నవించింది. చెల్లింపుల్లో విఫలమైతే ఈ ముగ్గురూ లొంగిపోతారని పేర్కొంది.