యాంబీ వ్యాలీ వేలానికి సిద్ధం కండి!
Published Tue, Jul 25 2017 6:53 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
న్యూఢిల్లీ : సహారా గ్రూప్‌కు చెందిన అత్యంత విలువైన ఆస్తి యాంబీ వ్యాలీ వేలం వేసే ప్రక్రియను చేపట్టాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం, బొంబై హైకోర్టును ఆదేశించింది. యాంబీ వ్యాలీ ప్రాపర్టీస్‌కు సంబంధించిన విక్రయ నోటీసు ప్రచురించాలని పేర్కొంది. జూలై 15 వరకు రూ.552 కోట్లను సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని, లేకపోతే సహారా గ్రూపుకు చెందిన విలువైన యాంబీ వ్యాలీని వేలం వేస్తామని అంతకముందే సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయితే దీనిలో రూ.247 కోట్లను మాత్రమే సహారా చీఫ్ సెబీ అకౌంట్‌లో జమచేశారు.
మిగతా మొత్తం రూ.305.21 కోట్లను ఆగస్టు 21 వరకు డిపాజిట్ చేస్తామని సుబ్రతారాయ్ తరుఫున న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ చెప్పారు. బ్యాలెన్స్ మొత్తంతో పాటు రూ.1500 కోట్లను సెప్టెంబర్ 7 వరకు సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు సుబ్రతారాయ్‌ను ఆదేశించింది. దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు బెంచ్ ఈ కీలక ఆదేశాలు జారీచేసింది. అంతేకాక సుబ్రతారాయ్ పెరోల్ గడువును అక్టోబర్ 10 వరకు కోర్టు పొడగించింది. తుదపరి విచారణను సెప్టెంబర్11న చేపట్టనునున్నట్టు కోర్టు చెప్పింది.
Advertisement