Aamby Valley
-
వేలానికి సహారా యాంబి వ్యాలీ
-
యాంబీ వ్యాలీ వేలం నేడే
ముంబై: సహారా గ్రూపునకు చెందిన విలువైన యాంబీ వ్యాలీ వేలానికి ముహూర్తం ఖరారైంది. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన మూడు రోజుల తరువాత ఈ ప్రిస్టీజియస్ భవనాన్ని బాంబై హైకోర్టు సోమవారం వేలం వేయనుంది. వేలం నిలిపివేతకు సహారా గ్రూపు అభ్యర్థనను సుప్రీం తిరస్కరించిన నేపథ్యంలో సహారా గ్రూపునకు అతి కీలకంగా భావించే మహారాష్ట్ర , పుణే లోనావాలాలోని వ్యాలీని నేడు బహిరంగ వేలంవేయనుంది. అధికారిక లిక్విడేటర్ రూ.37,392 కోట్ల రిజర్వ్ ధరగా నిర్ణయించింది. కాగా వేలం ప్రక్రియను నిలిపివేస్తే, రూ.1,500 కోట్లు తక్షణం చెల్లిస్తామని సహారా చీఫ్ సుబ్రతో రాయ్ చేసిన ప్రతిపాదనను తీరస్కరించిన సుప్రీం రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రకారం సహారా వడ్డీతో కలిపి దాదాపు రూ.35,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
యాంబీ వ్యాలీ వేలం నిలిపివేతకు సుప్రీం నో!
సెప్టెంబర్ 7లోపు రూ.1,500 కోట్లు జమచేస్తే, తదుపరి తగిన ఉత్తర్వులిస్తామని స్పష్టీకరణ న్యూఢిల్లీ: మహారాష్ట్ర పుణేలోని రూ.34,000 కోట్ల యాంబీ వ్యాలీ వేలాన్ని నిలిపివేయాలని సహారా చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. వేలం ప్రక్రియను నిలిపివేస్తే, రూ.1,500 కోట్లు తక్షణం చెల్లిస్తామని సుబ్రతో రాయ్ చేసిన ప్రతిపాదనను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ప్రస్తావిస్తూ, ‘నమ్మశక్యం కాని అంశాన్ని నమ్మడమే’ అని వ్యాఖ్యానించింది. వేలం ప్రక్రియ నిర్ణేత షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని, అయితే సెప్టెంబర్ 7వ తేదీ లోపు సెబీ–సహారా రిఫండ్ అకౌంట్లో రూ.1,500 కోట్లు జమచేస్తే మాత్రం బెంచ్ తగిన ఆదేశాలు ఇస్తుందని బెంచ్ స్పష్టం చేసింది. న్యూయార్క్ హోటల్స్ విక్రయం సహారా అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ, న్యూయార్క్‌లోని హోటల్స్‌ను అమ్మడం జరిగిందనీ, త్వరలో ఈ నిధులు సహారా అకౌంట్‌కు వస్తాయని, వెను వెంటనే సెప్టెంబర్ 7లోపు సెబీ–సహారా అకౌంట్‌కు రూ.1,500 కోట్లు జమచేస్తామని తెలిపారు. సహారా వడ్డీతో కలిపి దాదాపు రూ.35,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని మార్కెట్ రెగ్యులేటర్– సెబీ సుప్రీంకోర్టుకు చెబుతోంది. -
యాంబీ వ్యాలీ వేలానికి సిద్ధం కండి!
న్యూఢిల్లీ : సహారా గ్రూప్‌కు చెందిన అత్యంత విలువైన ఆస్తి యాంబీ వ్యాలీ వేలం వేసే ప్రక్రియను చేపట్టాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం, బొంబై హైకోర్టును ఆదేశించింది. యాంబీ వ్యాలీ ప్రాపర్టీస్‌కు సంబంధించిన విక్రయ నోటీసు ప్రచురించాలని పేర్కొంది. జూలై 15 వరకు రూ.552 కోట్లను సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని, లేకపోతే సహారా గ్రూపుకు చెందిన విలువైన యాంబీ వ్యాలీని వేలం వేస్తామని అంతకముందే సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయితే దీనిలో రూ.247 కోట్లను మాత్రమే సహారా చీఫ్ సెబీ అకౌంట్లో జమచేశారు. మిగతా మొత్తం రూ.305.21 కోట్లను ఆగస్టు 21 వరకు డిపాజిట్ చేస్తామని సుబ్రతారాయ్ తరుఫున న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ చెప్పారు. బ్యాలెన్స్ మొత్తంతో పాటు రూ.1500 కోట్లను సెప్టెంబర్ 7 వరకు సెబీ-సహారా అకౌంట్లో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు సుబ్రతారాయ్‌ను ఆదేశించింది. దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు బెంచ్ ఈ కీలక ఆదేశాలు జారీచేసింది. అంతేకాక సుబ్రతారాయ్ పెరోల్ గడువును అక్టోబర్ 10 వరకు కోర్టు పొడగించింది. తుదపరి విచారణను సెప్టెంబర్11న చేపట్టనునున్నట్టు కోర్టు చెప్పింది. -
యాంబీ వ్యాలీకి రూ.24,647 కోట్ల ఐటీ నోటీస్!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన యాంబీ వ్యాలీ లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.24,647 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ అకౌంట్ల ప్రత్యేక ఆడిట్ అనంతరం కొద్ది నెలల క్రితం ఈ నోటీసులు జారీ ఆయ్యాయి. సహారా గ్రూప్ ప్రతినిధి తాజాగా ఈ పరిణామాన్ని ధ్రువీకరించారు. 2012–13 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి రూ.48,086 కోట్ల ఆదాయం సంస్థ రికార్డ్ బుక్స్‌లో ప్రతిబింబించలేదని సంబంధిత ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. దీనితో పన్ను, జరిమానాగా ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సహారాకు చెందిన రెండు గ్రూప్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్ల సమీకరణ, పునఃచెల్లింపుల్లో (వడ్డీసహా దాదాపు రూ.37,000 కోట్లు) వైఫల్యం కేసులో యాంబీ వ్యాలీ అమ్మకానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ నెల 28న సహారా చీఫ్ సుబ్రతా రాయ్ సుప్రీంకోర్టు ముందు స్వయంగా హాజరుకావాల్సి ఉంది.