యాంబీ వ్యాలీకి రూ.24,647 కోట్ల ఐటీ నోటీస్‌! | IT dept issues Rs 24,646 crore notice to Sahara's Aamby Valley | Sakshi
Sakshi News home page

యాంబీ వ్యాలీకి రూ.24,647 కోట్ల ఐటీ నోటీస్‌!

Published Wed, Apr 26 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

యాంబీ వ్యాలీకి రూ.24,647 కోట్ల ఐటీ నోటీస్‌!

యాంబీ వ్యాలీకి రూ.24,647 కోట్ల ఐటీ నోటీస్‌!

న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన యాంబీ వ్యాలీ లిమిటెడ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.24,647 కోట్ల డిమాండ్‌ నోటీసు ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ అకౌంట్ల ప్రత్యేక ఆడిట్‌ అనంతరం కొద్ది నెలల క్రితం ఈ నోటీసులు జారీ ఆయ్యాయి. సహారా గ్రూప్‌ ప్రతినిధి తాజాగా ఈ పరిణామాన్ని ధ్రువీకరించారు. 2012–13 అసెస్‌మెంట్‌ ఇయర్‌కు సంబంధించి రూ.48,086 కోట్ల ఆదాయం సంస్థ రికార్డ్‌ బుక్స్‌లో ప్రతిబింబించలేదని సంబంధిత ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి.

దీనితో పన్ను, జరిమానాగా ఐటీ శాఖ డిమాండ్‌ నోటీసు జారీ చేసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. సహారాకు చెందిన రెండు గ్రూప్‌ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి రూ.24,000 కోట్ల సమీకరణ, పునఃచెల్లింపుల్లో (వడ్డీసహా దాదాపు రూ.37,000 కోట్లు) వైఫల్యం కేసులో  యాంబీ వ్యాలీ అమ్మకానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో ఈ నెల 28న సహారా చీఫ్‌ సుబ్రతా రాయ్‌ సుప్రీంకోర్టు ముందు స్వయంగా హాజరుకావాల్సి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement