సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ | SC permits Sahara to sell 4 properties worth over Rs. 2700 crore | Sakshi
Sakshi News home page

సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

Published Wed, Dec 3 2014 12:34 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ - Sakshi

సహారా ఆస్తుల అమ్మకానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: సహారా గ్రూప్ దేశీయంగా నాలుగు ప్రాపర్టీలను విక్రయించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. జైల్లో ఉన్న సంస్థ చైర్మన్ సుబ్రతో రాయ్ బెయిల్‌కు కావాల్సిన రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు సహారా గ్రూప్ ఈ విక్రయాలు తలపెట్టింది. పుణే, జోధ్‌పూర్, చౌమా (గుడ్‌గావ్), వసై (ముంబై)లలోని ప్రాపర్టీలను అమ్మడం ద్వారా కంపెనీ రూ. 2,710 కోట్లు సమీకరించవచ్చని అంచనా.

ఈ ఆస్తుల విక్రయ లావాదేవీలు వచ్చే ఏడాది మేలోగా పూర్తి కావాల్సి ఉంటుందని జస్టిస్ టీఎస్ ఠాకూర్ సారథ్యంలోని బెంచ్ ఆదేశించింది. కొనుగోలుదారులు ఈలోగా సెబీ-సహారా రీఫండ్ అకౌంటు పేరిట పోస్ట్ డేటెడ్ చెక్కులను డిపాజిట్ చేయాలని సూచించింది. విక్రయ ప్రక్రియ గురించి సహారా తరఫు న్యాయవాదులు సుప్రీంకు వివరించారు. ఇన్వెస్టర్లకు రూ. 20,000 కోట్ల రీఫండ్ కేసుకు సంబంధించి సుబ్రతో రాయ్ ఈ ఏడాది మార్చి 4 నుంచి జైల్లోనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement