తుపాకులతో బెదిరించి రూ. 40లక్షల దోపిడి! | Jewellery, cash worth Rs.40 lakh looted in Ghaziabad | Sakshi
Sakshi News home page

తుపాకులతో బెదిరించి రూ. 40లక్షల దోపిడి!

Published Sat, Apr 30 2016 10:16 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Jewellery, cash worth Rs.40 lakh looted in Ghaziabad

ఘజియాబాద్: బంగారపు షాపులో దుండగులు పడి రూ.40లక్షల విలువైన డబ్బు, బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన శనివారం మధ్యాహ్నం నగరంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రావల్పిండి జ్యువెలర్ లో ఐదుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా ముఖాలకు గుడ్డలు కట్టుకుని తుపాకీలతో లోపలికి ప్రవేశించారు.

ఇద్దరు బయట బైక్ లతో సిద్ధంగా ఉండగా మిగిలిన ముగ్గురు 15 నిమిషాల్లో దోపిడీ పూర్తిచేసి తూర్పు వైపుగా పారిపోయారని పోలీసులు తెలిపారు. షాపులోకి ప్రవేశించిన తర్వాత దొంగలు జెబుల్లో నుంచి తుపాకీలు తీసి బెదిరించినట్లు ఓనర్ తెలిపాడు. షాపులో విలువైన వస్తువులతో పాటు క్యాష్ ను కూడా తీసుకువెళ్లినట్టు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ల్లోని దొంగల గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఏటువంటి ఆధారాలు తమకు లభించలేదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సల్మాన్ తాజ్ పాటిల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement