పోయే కాలం అంటే ఇదేనేమో.. సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన మహిళ  | Ghaziabad Woman Stands On 4th-floor Railing To Clean Window | Sakshi
Sakshi News home page

మహిళ చేసిన పనికి అంతా షాక్‌.. వీడియో వైరల్‌

Published Fri, Feb 25 2022 4:10 PM | Last Updated on Fri, Feb 25 2022 4:11 PM

Ghaziabad Woman Stands On 4th-floor Railing To Clean Window - Sakshi

లక్నో: ఓ మహిళ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఆమె చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. కిటికీ కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టడమేంటని ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. ఓ వీర వనిత చేసిన ఈ స్పెషల్‌ ఫీట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి సదరు మహిళపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. 
ఉత్తరప్రేదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆ ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో నివాసం ఉంటోంది. కాగా, తన ఇంట్లోని కిటికీని క్లీన్‌ చేయాలని సదరు మహిళ నిర్ణయించుకుంది. వెంటనే ఓ క్లాత్‌ తీసుకుని రంగంలోకి దిగింది. అయితే నాలుగో అంతస్తులో ఉన్న ఆమె.. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా అంత ఎత్తులో ఒంటి చేత్తో కిటికీని క్లీన్‌ చేసింది. ఆమె పని చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ చేసిన పనికి.. కొందరు ఆమెను డేరింగ్‌ ఉమెన్‌ అని పొడుగుతుంటే.. ప్రాణాలను లెక్క చేయకపోవడం ఆమె పిచ్చితనమంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement