వేధింపులకు గురి చేసిన అత్త వంట గదిలో ఉండగా.. | Woman Assassinated By Daughter In Law Tamil Nadu | Sakshi
Sakshi News home page

వేధింపులకు గురి చేసిన అత్త వంట గదిలో ఉండగా..

Jan 2 2022 4:48 AM | Updated on Jan 2 2022 5:36 AM

Woman Assassinated By Daughter In Law Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు: వేధింపులకు గురి చేసిన అత్తను హత్య చేసి తర్వాత గ్యాస్‌ లీకేజీ కారణంగా ఆమె మృతి చెందిందంటూ నాటకమాడిన కోడలిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచ్చి గాంధీ మార్కెట్‌ పాత పాల డిపో సమీపంలోని విశ్వాస్‌ నగర్‌కు చెందిన ఇబ్రహీం భార్య నవీన (46). వీరి కుమారుడు హసీనా ఖాన్‌ (28). రైస్‌ మిల్‌ నడుపుతున్నాడు. కొన్ని సంవత్సరాల ముందు ఇబ్రహీం మృతి చెందడంతో నవీన తన కుమారుడై హసీనా ఖాన్, కోడలు రేష్మాతో కలిసి ఉంటున్నారు.

గురువారం బయటకు వెళ్లిన హసీనా ఖాన్‌ ఇంటికి వచ్చిన సమయంలో తల్లి నవీన వంట గదిలో కాలిన స్థితిలో శవంగా పడివుంది. గ్యాస్‌ లీకేజీ కారణంగా ఏర్పడిన మంటల వల్ల ఆమె మృతి చెందినట్లు రేష్మ తెలిపింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా రేష్మా వంట గదిలో అల్లం దంచే బండరాయితో అత్తను హత్య చేసినట్లు తేలింది. తర్వాత గ్యాస్‌ లీక్‌ చేసి నిప్పు పెట్టి మృతదేహాన్ని దహనం చేసినట్లు గుర్తించారు. అనంతరం రేష్మను అరెస్టు చేశారు. 
  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement