బలత్కారం చేయడానికి ప్రయత్నించి.. కుదరకపోవడంతో.. | Man Assassinated Woman After Molestation Attempt Tamil Nadu | Sakshi
Sakshi News home page

బలత్కారం చేయడానికి ప్రయత్నించి.. కుదరకపోవడంతో

Published Tue, Jan 25 2022 8:24 AM | Last Updated on Tue, Jan 25 2022 8:49 AM

Man Assassinated Woman After Molestation Attempt Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు: మహిళా ఉద్యోగినిపై అత్యాచార యత్నానికి పాల్పడడమే కాకుండా ఈక్రమంలో ఆమెను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కామరాజపురానికి చెందిన నాగరత్నం (65). పుదుకోట్టై పాత ప్రభుత్వ ఆసుపత్రిలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న ఈమె విశ్రాంతి గదిలో బస చేస్తున్నారు. ఈనెల 20వ తేదీన ఆసుపత్రి ఉద్యోగులు పనికి వచ్చిన సమయంలో నాగరత్నం తీవ్రగాయాలతో మృతి చెంది ఉన్నారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు. కాగా ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో అనుమానా స్పదంగా తిరుగుతున్నట్లు తెలిసింది. వీరిలో ఒకరిని పుదుక్కోటై చేపల మార్కెట్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు జీవరత్నం (46) అని తెలిసింది. ఇతను వీరరసు అనే వ్యక్తితో కలిసి నాగరత్నంను హత్య చేసినట్లు అంగీకరించాడు. బలత్కారం చేయడానికి ప్రయత్నించగా, ఆమె ప్రతిఘ టించడంతో హత్య చేసి పారిపోయినట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement