
నిందితుడు షణ్ముగం
సాక్షి, సేలం (తమిళనాడు): మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని ఆదివారం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సేలం జిల్లా కరుమందురైకు చెందిన వృద్ధురాలు మేకలు మేపుతూ జీవనం సాగిస్తోంది. శనివారం సాయంత్రం పొలంలో మేకలు మేపుతున్నారు.
అదే ప్రాంతానికి చెందిన షణ్ముగం (25) మద్యం మత్తులో వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకునే లోగా షణ్ముగం పరారయ్యాడు. కరుమందురై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ధనలక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment