అఫ్గానిస్తాన్‌లో సోమవారం జరిగిన పలు ఆత్మాహుతి దాడుల్లో పది మంది విలేకరులు, పదకొండు మంది చిన్నారులు సహా 37 మంది దుర్మరణం పాలయ్యారు. రాజధాని కాబూల్‌లో రెండు బాంబు పేలుళ్లలో కలిపి 25 మంది చనిపోగా, కాందహార్‌లో జరిగిన మరో దాడిలో 11 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.