సుప్రీంకోర్టు రిపోర్టర్‌కు లా డిగ్రీ అక్కర్లేదు | Law degree not needed anymore to become Supreme Court correspondent | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు రిపోర్టర్‌కు లా డిగ్రీ అక్కర్లేదు

Published Fri, Oct 25 2024 4:02 AM | Last Updated on Fri, Oct 25 2024 4:02 AM

Law degree not needed anymore to become Supreme Court correspondent

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకొనే రిపోర్టర్లు తప్పనిసరిగా న్యాయవిద్యను అభ్యసించి ఉండాలనే నిబంధనను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఎత్తివేశారు. ‘సుప్రీంకోర్టు వార్తలను కవర్‌ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టారో తెలియదు. దాన్ని ఎత్తివేస్తూ ఫైల్‌పై సంతకం చేశాను. 

ఇక మరింత మంది సుప్రీంకోర్టు అక్రిడేషన్‌ పొందొచ్చు’ అని సీజేఐ చంద్రచూడ్‌ గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నవంబరు 10వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్‌ చంద్రచూడ్‌ తన హయాంలో పలు సంస్కరణలు తెచ్చారు. ఈ–ఫైలింగ్‌ను ప్రవేశపె ట్టారు. హైబ్రిడ్‌ విచారణ పద్ధతి (ప్రత్యక్ష విచా రణ, ఆన్‌లైన్‌ విచారణలను కలగలిపి) తెచ్చారు. 

వాయు కాలుష్యానికి మార్నింగ్‌ వాక్‌ ఆపేశా
దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్‌ వాక్‌ను ఆపేశానని సీజేఐ చంద్రచూడ్‌ తెలిపారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు  రాకుండా ఉండాలంటే ఇంటికే పరిమితం కావాలని డాక్టర్‌ తనకు సూచించారని వెల్లడించారు. ‘ఈ రోజు నుంచే మార్నింగ్‌ వాక్‌ ఆపేశా. సాధారణంగా ఉదయం 4–4.15కు మార్నింగ్‌ వాక్‌కు వెళతా’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement