degree provisional
-
సుప్రీంకోర్టు రిపోర్టర్‌కు లా డిగ్రీ అక్కర్లేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకొనే రిపోర్టర్లు తప్పనిసరిగా న్యాయవిద్యను అభ్యసించి ఉండాలనే నిబంధనను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఎత్తివేశారు. ‘సుప్రీంకోర్టు వార్తలను కవర్ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టారో తెలియదు. దాన్ని ఎత్తివేస్తూ ఫైల్‌పై సంతకం చేశాను. ఇక మరింత మంది సుప్రీంకోర్టు అక్రిడేషన్ పొందొచ్చు’ అని సీజేఐ చంద్రచూడ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నవంబరు 10వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చంద్రచూడ్ తన హయాంలో పలు సంస్కరణలు తెచ్చారు. ఈ–ఫైలింగ్‌ను ప్రవేశపె ట్టారు. హైబ్రిడ్ విచారణ పద్ధతి (ప్రత్యక్ష విచా రణ, ఆన్లైన్ విచారణలను కలగలిపి) తెచ్చారు. వాయు కాలుష్యానికి మార్నింగ్ వాక్ ఆపేశాదేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ వాక్‌ను ఆపేశానని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇంటికే పరిమితం కావాలని డాక్టర్ తనకు సూచించారని వెల్లడించారు. ‘ఈ రోజు నుంచే మార్నింగ్ వాక్ ఆపేశా. సాధారణంగా ఉదయం 4–4.15కు మార్నింగ్ వాక్కు వెళతా’ అని తెలిపారు. -
సమంత పోస్ట్.. ఫ్యాన్స్ దిల్ కుష్
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న హీరోయిన్ సమంత మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. చదువుకునే తనకు వచ్చిన మార్కులను అభిమానులకు చూపించింది. టెన్త్, ఇంటర్ మార్క్ షీట్లులను తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. తన బికామ్ ప్రొవిజినల్ సర్టిఫికెట్ కూడా పోస్ట్ చేసింది. తనకు వచ్చిన మార్కులు ఆశ్చర్యానికి గురిచేశాయని 'అ ఆ' స్టార్ పేర్కొంది. చెన్నైలోని సీఎస్ఐ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో సమంత టెన్త్ చదివింది. హోలి ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెంకడరీ స్కూల్ లో ఇంటర్ చేసింది. మద్రాస్ యూనివర్సిటీ పరిధిలోని స్టెల్లా మెరీస్ కాలేజీలో డిగ్రీ చదివి డిస్టింక్షన్ లో పాసైంది. పట్టభద్రురాలైన తర్వాత సినిమాల్లోని వచ్చానని వెల్లడించింది. కష్టపడితో ఏ రంగంలోనైనా రాణిస్తారని అభిమానులకు సలహాయిచ్చింది. తమ ఫేవరేట్ హీరోయిన్ కు వచ్చిన మార్కులు చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమెను మెచ్చుకుంటూ మెసేజ్ లు పెట్టారు. 29 ఏళ్ల సమంత ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'జనతా గ్యారేజీ' సినిమాలో నటిస్తోంది.