సమంత పోస్ట్.. ఫ్యాన్స్ దిల్ కుష్‌ | Samantha Found Her Old Report Cards, Posted Them on Facebook | Sakshi
Sakshi News home page

సమంత పోస్ట్.. ఫ్యాన్స్ దిల్ కుష్‌

Published Mon, Jul 18 2016 8:49 AM | Last Updated on Mon, Sep 4 2017 5:16 AM

సమంత పోస్ట్.. ఫ్యాన్స్ దిల్ కుష్‌

సమంత పోస్ట్.. ఫ్యాన్స్ దిల్ కుష్‌

సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న హీరోయిన్ సమంత మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. చదువుకునే తనకు వచ్చిన మార్కులను అభిమానులకు చూపించింది. టెన్త్, ఇంటర్ మార్క్‌ షీట్లులను తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. తన బికామ్ ప్రొవిజినల్ సర్టిఫికెట్ కూడా పోస్ట్ చేసింది. తనకు వచ్చిన మార్కులు ఆశ్చర్యానికి గురిచేశాయని 'అ ఆ' స్టార్ పేర్కొంది. చెన్నైలోని సీఎస్ఐ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో సమంత టెన్త్ చదివింది. హోలి ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెంకడరీ స్కూల్ లో ఇంటర్ చేసింది.

మద్రాస్ యూనివర్సిటీ పరిధిలోని స్టెల్లా మెరీస్ కాలేజీలో డిగ్రీ చదివి డిస్టింక్షన్ లో పాసైంది. పట్టభద్రురాలైన తర్వాత సినిమాల్లోని వచ్చానని వెల్లడించింది. కష్టపడితో ఏ రంగంలోనైనా రాణిస్తారని అభిమానులకు సలహాయిచ్చింది. తమ ఫేవరేట్ హీరోయిన్ కు వచ్చిన మార్కులు చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమెను మెచ్చుకుంటూ మెసేజ్ లు పెట్టారు. 29 ఏళ్ల సమంత ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'జనతా గ్యారేజీ' సినిమాలో నటిస్తోంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement