legal education
-
సుప్రీంకోర్టు రిపోర్టర్‌కు లా డిగ్రీ అక్కర్లేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకొనే రిపోర్టర్లు తప్పనిసరిగా న్యాయవిద్యను అభ్యసించి ఉండాలనే నిబంధనను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఎత్తివేశారు. ‘సుప్రీంకోర్టు వార్తలను కవర్ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టారో తెలియదు. దాన్ని ఎత్తివేస్తూ ఫైల్‌పై సంతకం చేశాను. ఇక మరింత మంది సుప్రీంకోర్టు అక్రిడేషన్ పొందొచ్చు’ అని సీజేఐ చంద్రచూడ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నవంబరు 10వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చంద్రచూడ్ తన హయాంలో పలు సంస్కరణలు తెచ్చారు. ఈ–ఫైలింగ్‌ను ప్రవేశపె ట్టారు. హైబ్రిడ్ విచారణ పద్ధతి (ప్రత్యక్ష విచా రణ, ఆన్లైన్ విచారణలను కలగలిపి) తెచ్చారు. వాయు కాలుష్యానికి మార్నింగ్ వాక్ ఆపేశాదేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ వాక్‌ను ఆపేశానని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇంటికే పరిమితం కావాలని డాక్టర్ తనకు సూచించారని వెల్లడించారు. ‘ఈ రోజు నుంచే మార్నింగ్ వాక్ ఆపేశా. సాధారణంగా ఉదయం 4–4.15కు మార్నింగ్ వాక్కు వెళతా’ అని తెలిపారు. -
గ్రామాలకూ న్యాయవిద్య: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయ విద్య కోర్సులను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఇంగ్లిష్ మాట్లాడని విద్యార్థులను సైతం న్యాయవిద్యలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేషనల్ లా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాంకేతికత మనకు సుదూరప్రాంత విద్యార్థులకు సైతం చేరువయ్యే సామర్థ్యాన్ని అందించింది. న్యాయ విద్య ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, ఆంగ్లం మాట్లాడే పట్టణ ప్రాంత పిల్లలకు మాత్రమే ప్రస్తుతం ఇది అనుకూలంగా ఉంది’అని అన్నారు. ‘ఇటీవల అయిదు లా యూనివర్సిటీల్లో ఓ సర్వే చేపట్టాం. విభిన్న భాషా నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థులు కేవలం ఇంగ్లిష్‌లో మాట్లాడ లేకపోవడమే కారణంతో ఈ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నట్లు సర్వేలో తేలింది’అని సీజేఐ వెల్లడించారు. భాషా పరమైన అవరోధాలను అధిగమించేందుకు భాషిణి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందన్నారు. ఇందులో సుప్రీంకోర్టు 1950–2024 మధ్య వెలువరించిన 36 వేల పైచిలుకు తీర్పులను తర్జుమా చేసి ఇందులో పొందుపరిచి ఉన్నాయన్నారు. జిల్లా స్థాయి కోర్టుల్లో ఇంగ్లిష్ మాట్లాడలేని న్యాయవాదులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. న్యాయవిద్యను హిందీలో బోధిస్తే ఉత్తమ విద్యార్థులు తయారవుతారని వర్సిటీ యంత్రాంగానికి ఆయన సూచించారు. -
PM Narendra Modi: దేశాల సమన్వయంతోనే న్యాయ వితరణ
న్యూఢిల్లీ: నేరగాళ్లు ఖండాంతరాల్లో నేరసామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వేళ దేశాలు సత్వర న్యాయ వితరణ కోసం మరింతగా సహకరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘కామన్వెల్త్ దేశాల అటార్నీలు, సొలిసిటర్ జనరళ్ల సమావేశం’లో ఆయన ప్రసంగించారు. ‘‘ఒక దేశ న్యాయస్థానాన్ని మరో దేశం గౌరవించిన నాడే ఈ సహకారం సాధ్యం. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది. క్రిప్టోకరెన్సీ, సైబర్ దాడుల విజృంభిస్తున్న ఈ తరుణంలో ఒక దేశ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులు మరో దేశంలోనూ అమలుకు సాధ్యమయ్యేలా సంస్కరణలు తేవాలి. అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం అందుతుంది. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నౌకాయానంలో ఇది సాధ్యమైంది. ఇకపై ఈ ఉమ్మడి విధానాన్ని కేసుల దర్యాప్తు, న్యాయవ్యవస్థలకూ విస్తరింపజేయాలి’’ అని అభిలషించారు. ఒక దేశంలో జరిగిన ఆర్థిక నేరాలు ఇంకొక దేశంలో అలాంటి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. లా స్కూళ్లలో మహిళల అడ్మిషన్లు పెరగాలని, అప్పుడే న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం: సీజేఐ న్యాయ వితరణలో న్యాయ స్థానాలకు సాంకేతికత అనేది శక్తివంతమైన పరికరంగా ఎదిగిందని సర్వో న్నత న్యాయస్థానం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అటార్నీల సదస్సులో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. ‘‘ సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ సాంకేతికతను శక్తివంతమైన ఉపకరణంగా వాడుతూ సద్వినియోగం చేస్తోంది. సాంకేతికతలను ఎల్లప్పుడూ సమాన త్వం, సమ్మిళితత్వాన్ని దృష్టిలో ఉంచుకునే అభివృద్ధిచేయాలి. న్యాయం అందించేందుకు కామన్వెల్త్ దేశాలు ఉమ్మ డిగా కట్టుబడి ఉండాలి. న్యాయ వితరణ లో రాజకీయాలకు ఏమాత్ర జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత న్యాయా ధికారులైన అటార్నీలు, సొలిసిటర్ జనరళ్లదే. అప్పుడే న్యాయవ్యవస్థ నైతిక త నిలబడుతుంది. సత్వర న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం తోడైంది. ప్రభుత్వాధికారులకు అనవసరంగా సమన్లు జారీ చేసే సంస్కృతి పోవాలి’’ అని సీజేఐ అన్నారు. -
నేడు క్లాట్ ఫలితాలు
న్యూఢిల్లీ: న్యాయ విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష(క్లాట్) ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా 19 ప్రతిష్టాత్మక జాతీయ న్యాయ కళాశాలల్లో ప్రవేశానికి ఈ పరీక్షను మే 13న నిర్వహించారు. ఫలితాలను నేడు ప్రకటించడానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆన్లైన్లో పరీక్ష జరుగుతున్న సమయంలో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల విలువైన సమయం కోల్పోయామని, ఆ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని కొందరు విద్యార్థులు దాఖలుచేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. విద్యార్థుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని జూన్ 6న నివేదిక సమర్పించాలని పరీక్ష నిర్వహించిన కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్(ఎన్‌యూఏఎల్‌ఎస్) ఫిర్యాదుల పరిష్కార కమిటీని కోర్టు ఆదేశించింది. కేరళ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎంఆర్ హరిహరన్ నాయర్, కొచ్చి యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా.సంతోష్ కుమార్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కొన్ని కేంద్రాల్లో సాంకేతిక సమస్యల వల్ల అభ్యర్థులు విలువైన సమయం కోల్పోయారని విద్యార్థుల తరఫున హాజరైన సీనియర్ లాయర్లు సల్మాన్ ఖుర్షీద్, జొహొబ్ హొస్సేన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఫలితాలను నిలిపివేయడం పరిష్కారం కాదని ఎన్‌యూఏఎల్‌ఎస్ తరఫు లాయర్ వి.గిరి వాదించారు. -
లా అడ్మిషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్యలో ప్రవేశాలు ఏటా ఆలస్యం అవుతూనే ఉన్నాయి. న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం వేల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) కాలేజీలకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం చేస్తుండటంతో ప్రవేశాల్లో జాప్యం తప్పడం లేదు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. బుధవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో న్యాయ విద్య ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ప్రవేశాలు ఇప్పటికే ఆలస్యం అయినందున ఈనెలలో ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్లను పూర్తి చేయాలన్న ఆలోచనకు కమిటీ సభ్యులు వచ్చారు. ఇందులో భాగంగా తాత్కాలిక షెడ్యూలును ఖరారు చేశారు. ఈనెల 13వ తేదీన ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీచేసి, 20 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. 21వ తేదీనుంచి 25వ తేదీవరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 28వ తేదీన సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. అయితే సీట్లను కేటాయించే 28వ తేదీ వరకు బీసీఐనుంచి కాలేజీలకు అనుమతులు రావాల్సి ఉంది. అవి వస్తేనే సీట్లను కేటాయించనున్నారు. నాలుగు నెలలుగా ఎదురుచూపులే.. న్యాయ విద్యలో ప్రవేశాలకోసం లాసెట్‌ను గత మే 27న నిర్వహించారు. ఈ పరీక్షకు 40 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆ పరీక్ష ఫలితాలను జూన్ 10వ తేదీన విడుదల చేశారు. అందులో 18,546 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారికి అప్పటినుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతులు ఇచ్చే విషయంలో బీసీఐ జాప్యం చేస్తూనే ఉంది. గత ఏడాది ఎల్ఎల్ఎంలో 524 సీట్లు, మూడేళ్ల లా కోర్సులో 2,590 సీట్లు, 5 ఏళ్ల లా కోర్సులో 1,176 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటికే కాకుండా మరిన్ని కొత్త కాలేజీలకు సైతం అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. అయితే అనుమతులపై మాత్రం బీసీఐ ఇంతవరకూ తేల్చలేదు. -
లా ప్రవేశాలకు 29 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
31 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు.. వచ్చే నెల 5న సీట్ల కేటాయింపు.. సాక్షి, హైదరాబాద్: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీ చేసినట్లు వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో లాసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయించినట్లు వివరించారు. మూడేళ్లు, ఐదేళ్ల న్యాయ విద్య, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులు ఈనెల 31 నుంచి వచ్చే నెల 4 వర కు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని... వచ్చే నెల 5న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. వచ్చే నెల 8 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రెండోదశ కౌన్సెలింగ్‌లో భాగంగా వచ్చే నెల 14, 15 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 250, ఇతర విద్యార్థులు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యేందుకు హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ, ఏవీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, కూకట్పల్లి జేఎన్టీయూహెచ్, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కోర్సు కాలేజీలు సీట్లు అర్హులైన అభ్యర్థులు మూడేళ్ల ఎల్ఎల్బీ 22 3,320 9,897 ఐదేళ్ల ఎల్ఎల్బీ 15 1740 2811 ఎల్ఎల్ఎం 12 560 1620 -
న్యాయ విద్యలో 5,620 సీట్లు
అనుమతినిచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 49 న్యాయ విద్య కళాశాలల్లో 5,620 సీట్ల భర్తీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓకే చెప్పింది. దీంతో ప్రవేశాల షెడ్యూలు జారీపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగే ప్రవేశాల కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూలు ఖరారు తేదీలను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మూడేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు 22 కాలేజీల్లో 3,320, 15 కాలేజీల్లో ఐదేళ్ల కోర్సులో 1,740, 12 కాలేజీల్లో ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం 560 సీట్లను భర్తీ చేసేందుకు బార్ కౌన్సిల్ అనుబంధ గుర్తింపునిచ్చింది. మరోవైపు గత జూలైలో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రవేశాల కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. వీరిలో మూడేళ్ల కోర్సుకు అర్హత సాధించిన వారు 9,887 మంది, ఐదేళ్ల కోర్సులో 2,811 మంది, ఎల్ఎల్ఎంలో 1,620 మంది ఉన్నారు.