సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ట్విటర్ మధ్య వివాదం కొనసాగుతున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రకటలు, ఫేక్ ఖాతాలు, నకిలీ వార్తలను, ట్విటర్ కంటెంట్‌ను నియంత్రించేలా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఈ మేరకు కేంద్రంతోపాటు ట్విటర్, ఇతరులకు ఈ నోటీసులిచ్చింది. ఈ సందర‍్భంగా ఫేక్‌న్యూస్‌పై చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖుల పేరిట వందలాది నకిలీ ట్విటర్ , ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత వినిత్ గోయెంకా గత ఏడాది మేలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోషల్ మీడియా నియంత్రణ కోరుతూ పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు దీన్ని ట్యాగ్ చేయాలని కూడా ఆదేశించింది. (500 మంది ట్విటర్ ఖాతాలు రద్దు)
ట్విటర్, మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఫేక్ న్యూస్, విద్వేష సందేశాలు, దేశద్రోహ సందేశాలపై నిఘా కోసం ఒక విధానాన్ని రూపొందించాలని బీజేపీ నేత వినీత్ గోయెంకా గతేడాది మేలో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.మరోవైపు రైతు ఉద్యమం నేపథ్యంలో పలువురు నకిలీ వార్తల ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టుతున్న కొన్ని ట్విటర్ ఖాతాలను రద్దు చేయాలని కేంద్రం ఇటీవల ట్విటర్‌ను కోరింది. అయితే ఇది భావస్వేచ్ఛకు భంగమంటూ మీడియా, జర్నలిస్టులు తదితర కొన్ని ఖాతాలను బ్యాన్ చేసేందుకు ట్విటర్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ ట్విటర్‌కు ప్రత్యామ్నాయంగా దేశీయ ట్విటర్ ‘కూ’ యాప్‌ను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. (ఐటీ శాఖ వ్యాఖ్యలు : ముదురుతున్న ట్విటర్ వివాదం)
Comments
Please login to add a commentAdd a comment