జాతీయ సదస్సుకు విశేష స్పందన
- గణిత, గణన పరిశోధనా ఒరవడిపై ఆచార్యుల, శాస్త్రవేత్తల ప్రసంగాలు
- హాజరైన దేశ, విదేశీ విద్యార్థులు
కాచిగూడ: రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాల వజ్రోత్సవాలను పురస్కరించుకుని గణిత, సాం ఖ్యాక శాఖల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కళాశాల అడిటోరియంలో ‘గణిత, గణన శాస్త్రాలలో సాగే ప్రస్తుత పరిశోధనా ఒరవడి’ అనే అంశంపై రెండు రోజు ల (శుక్ర,శని) పాటు నిర్వహించిన జాతీయ సదస్సుకు విశేష స్పందన లభించింది.
ఈ సదస్సులో తొమ్మిది మంది గణిత, గణన శాస్త్రాలలో నిష్ణాతులైన వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, జాతీయ పరిశోధనాలయాల లోని శాస్త్రజ్ఞులు పాల్గొని ప్రసంగించారు. సదస్సును ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రామకృష్ణ రామస్వామి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే కాకుండా విదేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
వివిధ యూనివర్సి టీల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలైన ఆచార్య వి.కణ్ణన్, సుజాత రామదురై, గంగాధర్ మిశ్రా, మంజు అగర్వాల్, డాక్టర్ రుషినారాయణసింగ్, వి.శివరామప్రసాద్, సి.రాఘవేంద్రరావు, వీవీ హరగోపాల్, డాక్టర్ కీర్తి శ్రీవత్సవ వివిధ అంశాలపై ఉపన్యసించారు. సదస్సులో కళాశాల కార్యదర్శి ప్రొఫెసర్ తిప్పారెడ్డి, ప్రొఫెసర్ ముత్యం రెడ్డి, ప్రిన్సిపాల్ ఎంవీ లక్ష్మీదేవి, డాక్టర్ కె.శారద పాల్గొన్నారు.