mathematical
-
ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు కన్నుమూత
వాషింగ్టన్: ప్రఖ్యాత భారత్–అమెరికన్ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102) అమెరికాలో కన్నుమూశారు. రాధాకృష్ణారావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. స్టాటిస్టిక్స్ రంగంలో సీఆర్ రావు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కాగా సీఆర్ రావుకు ఇటీవలె ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్’ను 2023 సంవత్సరానికి గాను రాధాకృష్ణారావు ఈ ఏడాది మే1 ఆయనకు ఈ అవార్డును అందుకున్నారు. 1945లో కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ఇదే గాక భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. With a heavy heart, we share the news of the passing of Prof. C R Rao, a true luminary in the field of statistics. #crrao #statistics #statistician #profcrrao #rao #datascience #R #python #omshanti pic.twitter.com/phwDdg6HZA — Statistics for You (@statistics4you) August 23, 2023 ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ.. కల్యంపూడి రాధాకృష్ణారావు 1920 సెప్టెంబరు 10న కర్ణాటకలోని హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో విద్యాభ్యాసం సాగింది. ఆంధ్ర విశ్వావిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో ఎంఎస్సీ చేశారు. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎంఏ డిగ్రీ అందుకున్నారు. ఇంగ్లండ్‌లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ చేశారు. 1965లో కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి డీఎస్సీ డిగ్రీ స్వీకరించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, తర్వాత కేంబ్రిడ్జిలోని ఆంత్రోపాలాజికల్ మ్యూజియంలో సేవలందించారు. పలు భారత, విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాత గణాంక, గణిత శాస్త్రవేత్త డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణ రావు గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. నిండు నూరేళ్లు జీవించిన ఈ అపర సరస్వతీ పుత్రుడు గణిత, గణాంక శాస్త్ర రంగాలలో చేసిన కృషి నిరూపమానం. 75 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల పిన్న వయసులో కోల్‌కతా మ్యాథమెటికల్… pic.twitter.com/Kbyca0cWyU — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 23, 2023 -
జాతీయ సదస్సుకు విశేష స్పందన
గణిత, గణన పరిశోధనా ఒరవడిపై ఆచార్యుల, శాస్త్రవేత్తల ప్రసంగాలు హాజరైన దేశ, విదేశీ విద్యార్థులు కాచిగూడ: రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి మహిళా కళాశాల వజ్రోత్సవాలను పురస్కరించుకుని గణిత, సాం ఖ్యాక శాఖల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కళాశాల అడిటోరియంలో ‘గణిత, గణన శాస్త్రాలలో సాగే ప్రస్తుత పరిశోధనా ఒరవడి’ అనే అంశంపై రెండు రోజు ల (శుక్ర,శని) పాటు నిర్వహించిన జాతీయ సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ సదస్సులో తొమ్మిది మంది గణిత, గణన శాస్త్రాలలో నిష్ణాతులైన వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, జాతీయ పరిశోధనాలయాల లోని శాస్త్రజ్ఞులు పాల్గొని ప్రసంగించారు. సదస్సును ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రామకృష్ణ రామస్వామి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే కాకుండా విదేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. వివిధ యూనివర్సి టీల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలైన ఆచార్య వి.కణ్ణన్, సుజాత రామదురై, గంగాధర్ మిశ్రా, మంజు అగర్వాల్, డాక్టర్ రుషినారాయణసింగ్, వి.శివరామప్రసాద్, సి.రాఘవేంద్రరావు, వీవీ హరగోపాల్, డాక్టర్ కీర్తి శ్రీవత్సవ వివిధ అంశాలపై ఉపన్యసించారు. సదస్సులో కళాశాల కార్యదర్శి ప్రొఫెసర్ తిప్పారెడ్డి, ప్రొఫెసర్ ముత్యం రెడ్డి, ప్రిన్సిపాల్ ఎంవీ లక్ష్మీదేవి, డాక్టర్ కె.శారద పాల్గొన్నారు.