సమదృష్టితోనే సుస్థిర అభివృద్ధి | Dr. VK Saraswat in National Convention | Sakshi
Sakshi News home page

సమదృష్టితోనే సుస్థిర అభివృద్ధి

Published Fri, Jul 14 2017 1:32 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM

సమదృష్టితోనే సుస్థిర అభివృద్ధి

సమదృష్టితోనే సుస్థిర అభివృద్ధి

నీతి ఆయోగ్‌ సభ్యుడు సారస్వత్‌
సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక, సామాజిక, పర్యా వరణ అంశాలపై సమదృష్టితో ప్రభుత్వాలు ముందుకుసాగితేనే సుస్థిర అభివృద్ధి సాధ్య మవుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే సారస్వత్‌ అన్నారు. ఎంసీఆర్‌హెచ్‌ ఆర్డీలో గురువారం ‘బంగారు తెలంగాణ– సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ అనే అంశంపై నిర్వహిం చిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం అభివృద్ధి వ్యూహాల్లో మార్పులు ఉండాలన్నారు. సుస్థిర అభివృద్ధి కోణంలో నిర్ణయాలను పరిశీలించడానికి ఒక వ్యవస్థను సృష్టించాల్సిన అవసరముంద న్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిం చుకున్న మూడేళ్లు, ఏడేళ్ల అభివృద్ధి ప్రణాళి కలు బాగున్నాయని ప్రశంసించారు.

మిషన్‌ భగీరథ భేష్‌...
రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్‌.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం రూ.14వేల కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ కార్యక్రమంపై ప్రశం సలు కురిపించారు. మిషన్‌ భగీరథ పథకం పూర్తయితే ప్రజల్లో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పచ్చదనం మరో 33% పెరుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులు బీవీ పాపారావు మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం జీడీపీ పరంగా తెలంగా ణను వృద్ధి పథంలో నడిపించడమే కాకుండా మానవాభివృద్ధి సూచీలో కూడా తమ స్థానాన్ని మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్‌ కో–ఆర్డినేటర్‌ డీగో పాలసియోస్, యూనిసెఫ్‌ హైద రాబాద్‌ విభాగం అధినేత మిథల్‌ రస్దియా, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement