
ఇల్లినాయిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా రాజా కృష్ణమూర్తి
డల్లాస్: 8వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇల్లినాయిస్ నుంచి యూఎస్ కాంగ్రెస్కు డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా డల్లాస్లోని పలువురు భారతీయులు కృష్ణమూర్తిని మర్యాద పూర్వకంగా కలిసి, ఆయనకు తమ మద్దతు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు గతంలో విధాన సలహాదారుగా కృష్ణమూర్తి పనిచేశారు.