అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక విశేషం చోటు చేసుకుంది. 2024 అమెరికా ఎన్నికల ఫలితాలతో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ ప్రతినిధి నాన్సీ పెలోసి యుఎస్ హౌస్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి వరుసగా 20 సార్లు గెలుపొందిన మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు.
అంతేకాదు హౌస్ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ కూడా నాన్సీ పెలోసి రికార్డు సృష్టించిన ఘనత కూడా ఆమె సొంతం. 1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2003 నుండి హౌస్ డెమొక్రాట్‌లకు నాయకత్వం వహించారు. హౌస్ ఆఫ్ కాంగ్రెస్‌లో ప్రధాన పార్టీకి నాయకత్వం వహించిన తొలి మహిళ. 2007- 2011 వరకు, తిరిగి 2019- 2023 వరకు హౌస్ స్పీకర్‌గా వ్యవహరించారు.
ఎక్కువ కాలం పనిచేసిన హౌస్ డెమోక్రాటిక్ నాయకురాలు పెలోసి. అలాగే చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన హౌస్ స్పీకర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.
ఎఫర్డబుల్ కేర్ రక్షణ చట్టంతో సహా కొన్ని కీలకమైన చట్టాలను ఆమోదించడంలో పెలోసి కీలక పాత్ర పోషించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన లాంటి ఇతర ముఖ్యమైన సందర్భాలలో పార్టీలో ఆమె పాత్ర కీలకం.
రాజకీయ వారసత్వం: రాజకీయంగా చురుకైన కుటుంబం నుండి వచ్చారు. నాన్సీ పెలోసి బాల్టిమోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి రాజకీయ మేత్త మేయర్ , కాంగ్రెస్ సభ్యుడు థామస్ డి'అలెసాండ్రో జూనియర్. వాషింగ్టన్ ట్రినిటీ కళాశాల నుండి నాన్సీ 1962లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్త పాల్ పెలోసిని వివాహం చేసున్నారు.
Comments
Please login to add a commentAdd a comment